Victory Venkatesh : ఒకే ఒక్క సినిమా సక్సెస్ తో తలరాత మొత్తం మారిపోవడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. విక్టరీ వెంకటేష్ కెరీర్ లో అదే జరిగింది. మల్టీస్టార్రర్ సబ్జక్ట్స్ చేసుకుంటూ సోలో హీరో గా 30 కోట్ల రూపాయిల షేర్ సినిమా కూడా లేని వెంకటేష్(Victory Venkatesh), సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ హీరోలలో మాస్ హీరోలుగా పిలవబడే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) లకు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఇప్పటి వరకు రాలేదు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తన రాబోయే సినిమాలను చాలా సాలిడ్ కాంబినేషన్స్ తో సెట్ చేసుకున్నాడు. దీని గురించి స్వయంగా ఆయనే తెలిపాడు. ప్రస్తుతం నార్త్ అమెరికా లో TANA ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొన్నాడు.
ఈ ఈవెంట్ లో తన తదుపరి చిత్రాల గురించి మాట్లాడుతూ ‘త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నాను. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ లో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను. ఇది చాలా ఫన్నీ గా ఉంటుంది. అలాగే మీనా తో కలిసి దృశ్యం 3 చేస్తున్నాడు,ఆ తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ చేస్తున్నాను. వీటి అన్నిటి తర్వాత నా మిత్రుడు నందమూరి బాలకృష్ణ తో ఒక భారీ మల్టీస్టార్రర్ చిత్రం కూడా ఖరారు అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి త్వరలోనే మనం మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ఒక సినిమా, అదే విధంగా నందమూరి బాలకృష్ణ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో మరో సినిమా చూడబోతున్నాము అన్నమాట. నిన్నటి తరం సూపర్ స్టార్స్ లో టాప్ 3 హీరోలైన వీళ్ళు అప్పట్లో కలిసి నటించలేకపోయారు కానీ, ఇప్పటి ట్రెండ్ పుణ్యమా అని ఈ ముగ్గురు హీరోలను వెండితెర పై చూసే అదృష్టం ఆడియన్స్ కలగబోతుంది.
Also Read: రియల్ కుంభకోణం.. స్టార్ హీరో మహేష్ బాబుకు మరో నోటీసులు.. టాలీవుడ్ లో కలకలం!
ఇదంతా పక్కన పెడితే వెంకటేష్, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు డైరెక్టర్ గా ఎవరు వ్యవహరించబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ ని నిర్మించాలంటే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అందరికంటే ముందు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వాళ్ళ బ్యానర్ మీదనే తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను, లేదా గోపీచంద్ మలినేని ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇందులో బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ , ప్రముఖ పాత్రలు పోషించడం లేదు. ఇది ఫక్తు మల్టీస్టార్రర్ చిత్రం గా తెరకెక్కబోతుంది టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.