Ankita Lokhande: బిగ్ బాస్ హౌస్లో కాపురం, ఆమెకు ప్రెగ్నెన్సీ!

భార్యాభర్తలను హౌస్లోకి పంపే సాంప్రదాయం ఉంది. తెలుగులో మొదటిసారిగా వరుణ్ సందేశ్-రితిక షేర్ పార్టిసిపేట్ చేశారు. సీజన్ 3లో వీరు పాల్గొన్నారు. అనంతరం సీజన్ 5లో భార్యాభర్తలైన రోహిత్-మారియా కంటెస్ట్ చేశారు.

Written By: NARESH, Updated On : November 18, 2023 12:22 pm

Ankita Lokhande

Follow us on

Ankita Lokhande: బిగ్ బాస్ హౌస్లో లేడీ కంటెస్టెంట్ కి మెడికల్ టెస్ట్స్ జరిగాయి. తనకు గర్భధారణ పరీక్షలు జరిగినట్లు ఆమె హౌస్లో వెల్లడించారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ క్రమంలో హౌస్లోనే కాపురం పెట్టారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి ఒంటరిగా వెళ్లిన వాళ్ళు జంటలు కావడం కామన్. రోజుల తరబడి నాలుగు గోడల మధ్య పరిచయం ప్రేమకు దారితీస్తుంది.

అలాగే భార్యాభర్తలను హౌస్లోకి పంపే సాంప్రదాయం ఉంది. తెలుగులో మొదటిసారిగా వరుణ్ సందేశ్-రితిక షేర్ పార్టిసిపేట్ చేశారు. సీజన్ 3లో వీరు పాల్గొన్నారు. అనంతరం సీజన్ 5లో భార్యాభర్తలైన రోహిత్-మారియా కంటెస్ట్ చేశారు. కాగా బిగ్ బాస్ హిందీ సీజన్ 17 ఇటీవల ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్నారు. ఈ సీజన్లో భార్యాభర్తలైన అంకిత లోఖండే, విక్కీ జైన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. హౌస్లోకి వెళ్లిన ఈ నెల రోజుల్లో ఇద్దరి మధ్య అనేక గొడవలు చోటు చేసుకున్నాయి.

ఎంత తిట్టుకున్నా మరలా కలిసిపోతారు. అయితే అంకిత లోఖండే భర్తతో ఒక షాకింగ్ విషయం చెప్పింది. వంట్లో బాగాలేదు, నీరసంగా ఉందని చెబితే నన్ను మెడికల్ రూమ్ కి తీసుకెళ్లారు. అక్కడ నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. రిజల్ట్ ఏమిటో చెప్పలేదని అన్నారు. దాంతో విక్కీ జైన్ షాక్ అయ్యాడు. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పరిస్థితి ఏంటని ఇద్దరూ భయపడ్డారు. ఈ న్యూస్ బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది.

ఒకవేళ అంకిత లోఖండే గర్భవతి అనే తెలిస్తే ఆమెను బయటకు పంపేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అంకిత లోఖండే సీరియల్ నటి. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి మాజీ ప్రేయసి. వీరిద్దరూ పవిత్ర రిస్తా అనే సీరియల్ లో జంటగా నటించారు. అప్పుడు ప్రేమలో పడ్డారు. పెళ్లి ప్రకటన కూడా చేశారు. అనంతరం విడిపోయారు. 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్ ని అంకిత లోఖండే వివాహం చేసుకుంది.