Homeఎంటర్టైన్మెంట్Natyam Movie:నాట్యం మూవీని ప్రశంసించిన... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Natyam Movie:నాట్యం మూవీని ప్రశంసించిన… ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Natyam Movie: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్​ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ… తానే స్వయంగా నిర్మించిన చిత్రం  నాట్యం. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వంలో… నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ చిత్రంపై విమర్శకుల సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ‘నాట్యం’ సినిమాను  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీక్షించారు.

vice president venkayya nayudu apprecites natyam movie team

ఈ మేరకు వెంకయ్య నాయుడు మూవీ యూనిట్ ని ప్రశంసించారు. ముఖ్యంగా సంధ్యా రాజు నటన ఈ చిత్రానికే హైలైట్ అని… నాట్యకళ గొప్పతనాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు గుర్తు చేయడం ఎంతో మంచి విషయం అన్నారు. చిత్ర విజయంపై మూవీ యూనిట్ అందరికీ శుభాకాంకాంక్షలు తెలియజేశారు. వెంపటి చిన్న సత్యం దగ్గర నాట్యం నేర్చుకున్నారు సంధ్య రాజు…  వందకు పైగా ప్రదర్శనలు నిర్వహించారని తెలుస్తుంది.

ఈ చిత్రం లో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, ‘శుభలేఖ’ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన తదితరులు నటించారు ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. అలానే నిన్న ఈ సినిమాను చూసిన బాలకృష్ణ సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. మరుగున పడుతున్న కళకు తిరిగి ప్రాణం పోసి… వాటిని తెరపైకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ నాట్యం కేవలం సినిమా కాదని..ఒక కళాఖండమని కొనియాడారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular