Vettaiyan Vs Kanguva: వెట్టయాన్ దెబ్బకి కంగువా సినిమా నిలబడుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పోల్చుకుంటే ప్రస్తుతం మిగితా సినిమా ఇండస్ట్రీ ల పరిస్థితి దారుణంగా తయారైంది...ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలోనే టాప్ లెవల్లో దూసుకుపోతుంది...

Written By: Gopi, Updated On : August 23, 2024 2:27 pm

Vettaiyan Vs Kanguva

Follow us on

Vettaiyan Vs Kanguva: ఆగస్టు 15వ తేదీన బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమం లోనే చాలా రోజుల నుంచి బాలీవుడ్ లో ఒక్క సక్సెస్ కూడా లేదు కానీ ఇప్పుడు స్త్రీ 2 సినిమాతో భారీ సక్సెస్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ నుంచి ఒక భారీ సక్సెస్ ని కూడా నమోదు చేసుకుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సైతం సాధ్యం కానీ రీతిలో ఆమె భారీ సక్సెస్ ని అందుకొని శ్రద్ధా కపూర్ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఇప్పటి వరకు 300 కోట్ల కలెక్షన్లతో ముందుకు దూసుకెళుతున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన ఖేల్ ఖేల్ మే, వేద రెండు సినిమాలు కూడా డిజాస్టర్లు గా మారాయి.. మరియు ఒకరకంగా చెప్పాలంటే స్త్రీ 2 సినిమానే ఆ రెండు సినిమాలను ఆడకుండా చేసిందంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ చర్చలైతే నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూడడానికి ఎక్కువ అసక్తి ని చూపిస్తూ వచ్చారు.

కాబట్టి ఆ రెండు సినిమాలు కూడా ఆశించడం మేరకు విజయం అయితే సాధించలేదు. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య కంగువా అనే ఒక పిరియాడికల్ మూవీని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్ టీజీ జ్ఞాన్ వేల్ రాజా డైరెక్షన్ లో చేస్తున్న వెట్టాయన్ సినిమా కూడా ఆగస్టు 10 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక కంగువా సినిమాతో పోల్చుకుంటే వెట్టయాన్ సినిమాలో అమితాబచ్చన్, ఫహాద్ ఫాజిల్ లాంటి గొప్ప నటులు నటిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా భారీ అంచనాలైతే క్రియేట్ అవుతున్నాయి. అలాగే పాన్ ఇండియాలో ఉన్న నటులందరూ ఈ సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మంచి మార్కెట్టు అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. మరి ‘వెట్టయాన్’ దెబ్బకి కంగువా సినిమా నిలబడగలుగుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వీళ్లకు థియేటర్ల కొరత అయితే ఏర్పడుతుంది. ఇక మిగిలిన ఇండస్ట్రీలో కూడా ధియేటర్లు దక్కినప్పటికీ సక్సెస్ టాక్ తెచ్చుకుంటే పర్లేదు లేకపోతే మాత్రం సినిమాని ఎవరు కాపాడలేరు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…