Dhanush Raayan OTT: ధనుష్ రాయన్ తో పాటు ఓటీటీలో సూపర్ హిట్ డబ్బింగ్ చిత్రాలు… ఎక్కడ చూడొచ్చు? డిటైల్స్!

రెండు క్రేజీ డబ్బింగ్ మూవీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. వాటిలో సూపర్ హిట్ రాయన్ చిత్రం కూడా ఉంది. మరి ఈ డబ్బింగ్ చిత్రాలను ఈ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో చుడొచ్చో తెలుసుకుందాం..

Written By: S Reddy, Updated On : August 23, 2024 1:54 pm

Dhanush Raayan OTT

Follow us on

Dhanush Raayan OTT: ప్రతి వీకెండ్ ఓటీటీలో కొత్త సినిమాల సందడి నెలకొంటుంది. ఈ వారం కూడా కొన్ని క్రేజీ మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ కల్కి 2898 ఏడీ ‘ గురువారం డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. రెండు ఓటీటీ సంస్థలు ఈ చిత్రాన్ని పంచుకున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కూడా కల్కి సినిమాకి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా, మిగతా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్స్ ప్రైమ్ లో ఉన్నాయి.

తాజాగా రెండు డబ్బింగ్ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఒకటి రాయన్ కాగా, మరొక చిత్రం తుఫాన్. ఈ రెండు తమిళ సినిమాలు, థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి. ఈ చిత్రాలను ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేసి నటించిన లేటెస్ట్ మూవీ ‘ ‘రాయన్ ‘. కుటుంబ కథా నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది.

రాయన్ జూలై 27న ధియేటర్స్ లో రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఓ మోస్తరు రెస్పాన్స్ దక్కించుకుంది. ‘ రాయన్ ‘ ధనుష్ 50వ చిత్రం కావడం విశేషం. ఈ సూపర్ హిట్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, ఎస్ జే సూర్య కీలక పాత్రలు పోషించారు.

డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్దమైన మరొక డబ్బింగ్ మూవీ ‘ తుఫాన్ ‘. ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ తుఫాన్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.తమిళంతో పాటు తెలుగు వెర్షన్ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా తమిళంలో ‘మజై పిడిక్కదా మణితన్’ పేరుతో ఆగస్టు 2న విడుదల చేశారు. తుఫాన్ మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక తుఫాన్ పేరుతో ఆగస్టు 11న తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అంతగా ఎక్కలేదు. దీంతో ధియేటర్స్ లో విడుదలైన రెండు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 22 నుంచి తుఫాన్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్టీమ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు మీ వీకెండ్ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. హ్యాపీ గా చూసి ఎంజాయ్ చేయండి.