https://oktelugu.com/

Samantha : ఏమా అందం ఏమా కలెక్షన్స్.. సమంత ను ఈ లుక్ లో చూడతరమా?

గత రాత్రి ముంబై వేదికగా జరిగిన అనామికా ఖన్నా సెలక్షన్ షోలో సమంత రూత్ ప్రభు మెరిసింది. ఇందులో పెద్ద పెద్ద సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ఆధునిక డిజైన్లతో ఇండియన్ సిల్హైట్లను కళాత్మకంగా విలీనం చేసే సేకరణను ప్రారంభించింది. ఇందులో అతిథులుగా రాషా తడాని, మీరా రాజ్‌పుత్, ఖుషీ కపూర్, సమంత, నేహా ధూపియా సహా ఇతర తారలతో నిండిపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2024 / 02:29 PM IST

    Samanth In Anamika Khanna Selection Show

    Follow us on

    Samantha :  దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య ఆమె మాజీ భర్త చై ఎంగేజ్ మెంట్ తో మరింత వార్తల్లోకి ఎక్కింది. ఇవన్నీ పక్కన ఉంచితే ఆమె అనామికా ఖన్నా కలెక్షన్ లో మెరిసింది. అనామికా ఖన్నా ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. అంతర్జాతీయ లేబుల్ ను కలిగి ఉన్ మొదటి భారతీయురాలు ఆమే. ఆమె క్రియేషన్స్ దేశ, విదేశాల్లో ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్లలో కూడా లభిస్తాయి. ఈ ఫ్యాషన్ రంగంలోకి రాక ముందు ఆమె క్లాసికల్ డాన్సర్. అందుకే ఆమె వస్త్రాలు శాస్త్రీయమైనవిగా.. ఫ్యాషన్ గా.. ఉంటాయి. బాలీవుడ్ లో చాలా సినిమాలకు ఆమె పని చేసింది. మౌసమ్ , ఐషా, ఫ్యాషన్, భాగ్ మిల్కా భాగ్ తో పాటు అనేక బాలీవుడ్ సినిమాలకు అనామికా ఖన్నా కలెక్షన్ల రూపొందించారు. 2015లో విడుదలైన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాలో హీరోయిన్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. తన టాక్ షోలో ‘సిమి సెలెక్ట్స్: ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్’లో సిమి గరేవాల్ వేసుకున్న దుస్తులను అనామికా డిజైన్ చేసింది. 1998లో కెరీర్ ప్రారంభించిన అనామికా ఖన్నా 2004లో అంతర్జాతీయ లేబుల్ ను ప్రారంభించారు. స్వీడన్ కు చెందిన H&M ద్వారా అనామిక తన దుస్తులను మార్కెట్ చేస్తుంది. ఇది ప్రపంచంలోని బహుళజాతి ఫ్యాషన్ రిటైలర్ సంస్థ. 1998లో తన ఫ్యాషన్ డిజైన్లను ప్రారంభించినప్పటి నుంచి అనామిక ఖన్నా భారతీయ ఫ్యాషన్‌ను పునర్నిర్మించడంలో, దేశం క్రాఫ్ట్ సంప్రదాయాలను విస్తృత పరిచేందుకు H&Mతో కలిసి పని చేస్తుంది. డిజైనర్ జాగ్రత్తగా పరిగణించబడే కాంట్రాస్ట్‌లు, ఫ్లూయిడ్ సిల్హౌట్‌లు, చేతితో తయారు చేసిన ఎంబ్రాయిడరీ అలంకారాలు, క్లిష్టమైన ప్రింట్‌ల సేకరణను రూపొందించడానికి భారతీయ, పాశ్చాత్య శైలి కోడ్‌లను విలీనం చేసిన దుస్తులను ఈ స్టోర్ నుంచి విక్రయాలు సాగిస్తుంది.

    గత రాత్రి ముంబై వేదికగా జరిగిన అనామికా ఖన్నా సెలక్షన్ షోలో సమంత రూత్ ప్రభు మెరిసింది. ఇందులో పెద్ద పెద్ద సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ఆధునిక డిజైన్లతో ఇండియన్ సిల్హైట్లను కళాత్మకంగా విలీనం చేసే సేకరణను ప్రారంభించింది. ఇందులో అతిథులుగా రాషా తడాని, మీరా రాజ్‌పుత్, ఖుషీ కపూర్, సమంత, నేహా ధూపియా సహా ఇతర తారలతో నిండిపోయింది.

    ఇందులో మీరా రాజ్‌పుత్ ఆక్వా-గ్రీన్ కాలర్‌తో మెరిసే నలుపు రంగు కటింగ్ బ్లేజర్‌లో గ్లామర్‌గా కనిపించింది. ఆమె బ్లేజర్‌ను బ్లాక్ బ్రాలెట్, ఫ్లేర్డ్ లెగ్గింగ్‌ తో పూర్తి చేసింది. హై హీల్స్, అద్భుతమైన గ్రీన్ స్టేట్‌మెంట్ చెవిపోగులతో ఆమె మరింత ఎలివేట్ చేయబడింది.

    హెచ్ అండ్ ఎం ఈవెంట్ నుంచి సమంత రూత్ ప్రభు ఫ్యూజన్ లుక్ డీకోడింగ్
    క్రాప్ టాప్ లో తన టోన్డ్ యాబ్స్ ను ప్రదర్శిస్తూ, స్కర్ట్ తో, ఆ తర్వాత స్కై-హై హీల్స్, అదనపు ఊంఫ్ ఫ్యాక్టర్ కోసం స్టేట్ మెంట్ యాక్సెసరీస్ తో ఆమె ఈ లుక్ అదిరింది.

    ఫ్యాషన్ ప్రియులందరూ సమంత లుక్ కోసం ఆరాటపడుతుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. రూ. 3,599 విలువ చేసే క్రోప్ ప్రింట్ షోల్డర్ ప్యాడ్ టాప్ ను ధరించింది. సిల్క్ స్కర్ట్ తో జత చేసి రూ.18,999 ధరకు సొంతం చేసుకుంది. అనామిక ఎక్స్ హెచ్ అండ్ ఎం కలెక్షన్ నుంచి కనిపించే గోల్డ్ టోన్డ్ బ్రాస్ లెట్లతో సమంత లుక్ ను డిజైన్ చేసింది. గిసెప్పె జానోట్టి గోల్డ్ హీల్స్ తో తన వస్త్రధారణను ప్రదర్శించింది.