https://oktelugu.com/

Vettaiyan Collections: ‘వెట్టియాన్’ తెలుగు వెర్షన్ క్లోసింగ్ కలెక్షన్స్.. రజినీకాంత్ కి దెబ్బ మీద దెబ్బ..ఇక నాగార్జునే దిక్కు!

విడుదలకు ముందు ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటికైతే ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి క్లోసింగ్ లో తెలుగు వర్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది, బయ్యర్స్ కి ఎంత నష్టాలను మిగిలించింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Written By:
  • Vicky
  • , Updated On : October 24, 2024 2:09 pm
    Vettaiyan Collection

    Vettaiyan Collection

    Follow us on

    Vettaiyan Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ భారీ అంచనాల నడుమ దసరా కానుకగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రజినీకాంత్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకు గత ఏడాది విడుదలైన ‘జైలర్’ చిత్రాన్ని తీసుకోవచ్చు. సూపర్ హిట్ టాక్ ని దక్కించుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘వెట్టియాన్’ చిత్రానికి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది కదా, అదే స్థాయి వసూళ్లు వస్తాయని అభిమానులు, ట్రేడ్ పండితులు అంచనా వేశారు. కానీ ఈ చిత్రానికి ‘జైలర్’ లో పావు శాతం గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలకు కలిపి కనీసం 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఇక తెలుగు లో అయితే ఈ సినిమా బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిలించాయి.

    విడుదలకు ముందు ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటికైతే ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి క్లోసింగ్ లో తెలుగు వర్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది, బయ్యర్స్ కి ఎంత నష్టాలను మిగిలించింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల 71 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత రెండవ రోజు కోటి 45 లక్షలు, మూడవ రోజు రెండు కోట్ల 5 లక్షలు, నాల్గవ రోజు కోటి 65 లక్షల రూపాయిలను రాబట్టింది. అలా నాలుగు రోజులకు 6 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో మరో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అదనంగా రాబట్టింది.

    ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ కి ఆరు కోట్ల రూపాయిలు తక్కువ అన్నమాట. కమర్షియల్ గా చూస్తే ఇది భారీ డిజాస్టర్ అనే చెప్పొచ్చు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే తమిళనాడు ప్రాంతంలో ఈ సినిమా ఇంకా వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోలేదు. అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 97 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీపావళి వరకు తమిళం లో రన్ అయ్యే అవకాశం ఉన్నందున వంద కోట్ల గ్రాస్ మార్కుని తమిళనాడు లో దాటే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే తమిళ వెర్షన్ లో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 220 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే రజినీకాంత్ కి ‘జైలర్’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ‘లాల్ సలాం’, ‘వెట్టియాన్’ వంటి ఫ్లాప్స్ వచ్చాయి. తెలుగు లో ఆయన సినిమాలకు ఇక భారీ బిజినెస్ జరగడం కష్టమే. ఆయన ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తో కూలీ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో నాగార్జున కూడా ఉండడంతో ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.