Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్ 7’ నామినేషన్స్ ని తల్చుకొని గొడవపడిన టేస్టీ తేజా, నయనీ పావని..ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసిన పావని!

నయనీ పావని వాళ్ళ వద్దకు వచ్చి కూర్చుంటుంది. ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడగగా, దానికి సీత సమాధానం చెప్తూ 'సీజన్ 4 లో మెహబూబ్ నామినేషన్స్ సమయంలో ఎలా ఉండేవాడు అని అడుగుతున్నాను. నువ్వు ఎవరిని నామినేట్ చేసావు?' అని అడగగా, దానికి నయనీ సమాధానం చెప్తూ 'నేను తేజాని, అమర్ ని నామినేట్ చేశాను' అని అంటుంది. నిన్ను ఎవరు నామినేషన్స్ చేసారు అని పావని ని అడగగా, 'నన్ను తేజా, ప్రశాంత్ నామినేట్ చేసారు.

Written By: Vicky, Updated On : October 9, 2024 8:33 am

Bigg Boss Telugu 8(97)

Follow us on

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత హౌస్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ గురించి ఒక కంటెస్టెంట్ తో మరో కంటెస్టెంట్ మాట్లాడేందుకు వీలు లేదని అప్పట్లో బిగ్ బాస్ కఠినమైన రూల్ పెట్టాడు. కానీ ఆ తర్వాతి సీజన్స్ లో దీని గురించి బిగ్ బాస్ కూడా పట్టించుకోవడం మానేసాడు. దీంతో కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ గా ఏర్పడి, ఎవరికి నామినేషన్ వెయ్యాలి..?, ఎవరికీ వేయకూడదు అని పబ్లిక్ గానే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సీజన్ 7 కి సంబంధించిన కంటెస్టెంట్స్ తో పాటు సీజన్ 1 , సీజన్ 4 కి సంబంధించిన కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టారు. దీంతో సీజన్ 7 కి చెందిన కంటెస్టెంట్స్ టేస్టీ తేజా, నయనీ పావని వాళ్ళ సీజన్ లో జరిగిన నామినేషన్ గురించి ప్రస్తావన వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా సీత, అవినాష్, మెహబూబ్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు.

అప్పుడే నయనీ పావని వాళ్ళ వద్దకు వచ్చి కూర్చుంటుంది. ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడగగా, దానికి సీత సమాధానం చెప్తూ ‘సీజన్ 4 లో మెహబూబ్ నామినేషన్స్ సమయంలో ఎలా ఉండేవాడు అని అడుగుతున్నాను. నువ్వు ఎవరిని నామినేట్ చేసావు?’ అని అడగగా, దానికి నయనీ సమాధానం చెప్తూ ‘నేను తేజాని, అమర్ ని నామినేట్ చేశాను’ అని అంటుంది. నిన్ను ఎవరు నామినేషన్స్ చేసారు అని పావని ని అడగగా, ‘నన్ను తేజా, ప్రశాంత్ నామినేట్ చేసారు. ప్రశాంత్ నేను ఇంట్లో సరిగా పనిచేయలేదని నామినేట్ చేసాడు, తేజా నేను టాస్కులలో వంద శాతం ఎఫర్ట్స్ పెట్టలేదని వేసాడు’ అని అంటుంది నయనీ పావని.

అప్పుడు టేస్టీ తేజా దీనికి స్పందిస్తూ ‘నేను ఆరోజు కరెక్ట్ పాయింట్ తోనే నామినేషన్ వేసాను. వంద శాతం ఎఫర్ట్స్ అంటే నేను మోకాళ్ళ వరకు మాత్రమే వంగగలను, అదే నా వంద శాతం ఎఫర్ట్స్, అంతకు మించి క్రిందకు నేను వంగలేను, అది నా వల్ల కాదు. ఆ పాయింట్ ని వివరించి నీకు నామినేషన్ వేసాను, నా పాయింట్ లో చాలా కరెక్ట్ ఉంది. బయటకి వెళ్లిన తర్వాత రివ్యూస్ చూసాను. అందరూ నిన్ను బండ బూతులు తిట్టారు’ అని అంటాడు టేస్టీ తేజా. దీనికి పాపం నయనీ పావని చాలా బాధపడుతుంది. ఆమెని హౌస్ మేట్స్ అందరూ ఓదారుస్తారు. నయనీ ని అంత మాట అన్నానా? , అయ్యో అని లోపలకు వెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్తాడు టేస్టీ తేజా. అధిక చనువు కారణంగా పొరపాటున నోటి నుండి వచ్చేసిందని, కావాలని ఉద్దేశపూర్వకంగా అన్నది కాదని తేజా వివరణ ఇవ్వడం, నయనీ పావని మరేం పర్వాలేదు అని చెప్పి వెళ్లడం చూసేందుకు చాలా బాగా అనిపించింది.