
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రెమిడిసెవిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొవిడ్ బాధితుల అవసరాన్ని ఆధారం చేసుకుని భారీ ధరలకు ఇంజక్షన్లు విక్రయిస్తున్న 10 మంది ముఠా సభ్యులను బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 27 ఇంజక్షన్లతో పాటు రూ. లక్షా 45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా వీరు ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.