‘Ala Vaikunthapurramuloo’ Hindi Release: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘అల వైకుంఠపురములో’. కాగా ఈ చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘షెహజాద్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా పై హిందీలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, మరోవైపు బాలీవుడ్ నిర్మాత మనీష్ షా ఈ చిత్రం హక్కులను దక్కించుకుని డబ్ చేసి హిందీలో విడుదల చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
దీంతో వెంటనే తేరుకున్న ‘షెహజాద్’ టీం కంగుతిని డబ్బింగ్ వెర్షన్ విడుదలను వాయిదా వేయించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్న బాలీవుడ్ నిర్మాత మనీష్ షా మాత్రం ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో హిందీలో రిలీజ్ చేయాల్సిందే అంటున్నాడు. అయితే ‘అల వైకుంఠపురములో’ డబ్బింగ్ మూవీగా హిందీలో రిలీజ్ అయితే ‘షెహజాద్’ నుంచి తాను తప్పుకుంటానని కార్తీక్ తెగేసి చెప్పాడట.
Also Read: జమిలీ ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపుతోందా?
మరి ఏమి జరుగుతుందో చూడాలి. బాలీవుడ్ నిర్మాత మనీష్ షా మాత్రం ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయినా ఫిబ్రవరి 6న ఈ చిత్రాన్ని తమ సొంత ఛానల్ అయినా ‘ఢించక్ టీవీ’లో ప్రసారం చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా రిలీజ్ చేసినా హిందీ రీమేక్ కి పెద్ద మైనసే. ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ లో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జోడీగా నటిస్తున్నారు.
మరి ‘అల వైకుంఠపురములో’ నుంచి కార్తీక్ తప్పుకుంటే నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. అయినా ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నప్పుడు.. అసలు డబ్బింగ్ రైట్స్ ను ఎందుకు అమ్మినట్టు ? ఏది ఏమైనా డబ్బింగ్ సినిమాల విషయంలో చాలా లొసుగులు ఉంటాయి. ఈ లొసుగులు కారణంగా ఒక్కో సారి హీరో కూడా బాగా నష్టపోవాల్సి వస్తోంది.
హిందీలో కార్తీక్ ఆర్యన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా కార్తీక్ ఆర్యన్ కి నాలుగు హిట్లు ఉన్నాయి. అందుకే, కార్తీక్ ఆర్యన్ ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. తేడా కొడితే.. వచ్చిన ఇమేజ్ కి పెద్ద మైనస్ అవుతుంది. కాబట్టి.. ‘అల వైకుంఠపురములో’ డబ్బింగ్ మూవీగా హిందీలో రిలీజ్ అయితే ‘షెహజాద్’ నుంచి తాను తప్పుకుంటానని కార్తీక్ కండీషన్ పెట్టాడు.
Also Read: ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదం?