Dimple Hayathi: ఎంత ఆధునిక సమాజంలో బ్రతుకుతున్నా కొన్ని నమ్మకాలు మాత్రం జనాలు వదలడం లేదు. పూజలు, వ్రతాలు, యజ్ఞాలు చేస్తే విజయం సాధిస్తామని భావిస్తున్నారు. వేణు స్వామికి వివాదాస్పద జ్యోతిష్కుడనే పేరుంది. ఆయన జాతకాల పేరుతో సెలబ్రిటీల మీద అనుచిత కామెంట్స్ చేస్తూ ఉంటాడు. నాగ చైతన్య, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మోక్షజ్ఞ, సమంతతో పాటు పలువురు ప్రముఖులను ఉద్దేశిస్తూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
అయితే ఆయనకు భక్తులు ఉన్నారు. రష్మిక మందాన వేణు స్వామి ప్రియ శిష్యురాలు. పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తల్లోనే వేణు స్వామితో ఆమెకు పరిచయం ఏర్పడింది. తరచుగా ఆమెతో వేణు స్వామి పూజలు చేయిస్తాడు. రష్మిక సక్సెస్ కి కారణం తాను చేసిన పూజలే అంటాడు. వేణు స్వామి పూజలు దారుణంగా ఉంటాయి. దేవుళ్లను మద్యం, మాంసం నైవేద్యంగా పెడతారు. ఎంత ఖరీదైన మద్యం పూజలో పెడితే అనుగ్రహం అంత గొప్పగా ఉంటుందట.
ఒక్కోసారి రూ. 40 వేలు విలువైన మద్యం కూడా పూజలో పెడతారట. పూజ విలువ, సెలెబ్రిటీ మీద మద్యం ధర ఆధారపడి ఉంటుందట. నిధి అగర్వాల్ సైతం వేణు స్వామి చేత పూజలు చేయించుకుంది. ఈ లిస్ట్ లో డింపుల్ హయాతీ చేరింది. వేణు స్వామి ఆమెతో ప్రత్యేక పూజలు చేయించారు. వేణు స్వామితో ఉన్న డింపుల్ హయాతి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఈ మధ్య డింపుల్ హయాతి పరిస్థితి ఏం బాగోలేదు. చేసిన ప్రతి సినిమా ప్లాప్ అవుతుంది. దానికి తోడు వివాదాలు, కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన ఖిలాడి, రామబాణం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన కేసులో ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. అందుకే ఆమె వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు.