Venu Yellamma Movie: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటుడు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఒక సినిమాని కమిట్ అయ్యే ముందు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి అనే ధోరణిలో హీరోలు సైతం ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని ఆ సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోలు,దర్శకులు సైతం భారీ గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇప్పటికే ‘బలగం’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వేణు లాంటి దర్శకుడు సైతం తన తదుపరి సినిమా ఎల్లమ్మ విషయంలో చాలా క్లారిటీగా వ్యవహరిస్తున్నాడు.
అయినప్పటికి తనకు ఇప్పటి వరకు హీరో దొరక్కపోవడం అనేది ఇప్పటికీ ప్రతి ఒక్కరిని బాధిస్తున్న విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రోజుకొక పేరు వినిపిస్తున్న నేపథ్యంలో వేణు ఎల్దండి సైతం ఈ విషయం మీద చాలా కామ్ గా ఉంటున్నారు. అలాగే ఇప్పటి దాకా ఈ సినిమాకి హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫిక్స్ అయిందనే వార్తలు వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు తను ‘ఎల్లమ్మ’ సినిమా చేయట్లేదని కరాకండి గా చెప్పేసింది. దాంతో హీరోతో పాటు హీరోయిన్ కష్టాలు కూడా ఈ సినిమాకి ఆధారంగా ఉన్నాయంటూ చాలామంది సినిమా ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన దక్కన్ అలాంటి వేణు ఎల్దండి చేసిన బలగం సినిమాతో వచ్చింది. మరి అలాంటి గొప్ప కథ ను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలిగిన వేణు ఎల్లమ్మ సినిమాని సైతం ఒక విలేజ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. అయినప్పటికి ఆ సినిమా విషయంలో ఆయన ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది తెలియాల్సి ఉంది…మొత్తానికైతే ఎల్లమ్మ సినిమా కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…