Venu Swamy Predicts and Proves Colour Swati divorce with Husband
Venu Swamy: సినిమా తారల జాతకాలు చెబుతూ వివాదాస్పద స్వామిజీగా వేణు స్వామి మారాడు. ఇటీవల హీరోయిన్ నయనతారకు పిల్లలు పుట్టే యోగమే లేదు. సరోగసి ద్వారా పిల్లలను కనడం అనేది ఒక డ్రామా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా మరో హీరోయిన్ వైవాహిక జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె భర్తతో విడిపోతారని ముందే తనకు తెలుసని వేణు స్వామి అన్నారు.
గతంలో వేణు స్వామి పలువురు హీరో, హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ నిజమయ్యాయి. దీంతో వేణు స్వామికి టాలీవుడ్ ఇండస్ట్రీలో డిమాండ్ ఏర్పడింది. అతను ఏం చెప్పినా జరుగుతుంది అని కొందరు విశ్వసిస్తున్నారు. అయితే వేణు స్వామి చెప్పేవన్నీ అబద్ధాలు అని కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు. వేణు స్వామి మాత్రం .. తాను వారి గ్రహ స్థితిని బట్టి జాతకం చెబుతానని .. వ్యూస్ కోసమో, లేక పాపులర్ అవ్వడం కోసం కాదని పలు మార్లు వెల్లడించాడు.
వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. గతంలో కలర్ స్వాతి తన వద్దకు వచ్చింది. జాతకం చూపించుకుంది. కలర్ స్వాతి జాతకం చూశాక, మీ సంసార జీవితం ఎక్కువ కాలం నిలబడదు అని చెప్పాను. మీరిద్దరూ విడాకులు తీసుకుంటారు. భర్తతో విడిపోయే పరిస్థితి ఉందని ఉన్నది ఉన్నట్లు చెప్పాను. ఆమె నన్ను బాగా తిట్టి వెళ్ళిపోయింది.
నేను చెప్పేది అర్థం చేసుకోకుండా కోపంతో అలా ప్రవర్తించింది. నేను చెప్పినట్టే కలర్ స్వాతి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. నేను కావాలని చెప్పినది కాదని .. ఆమె జాతకం అలా ఉందని వేణు స్వామి అన్నారు. కాగా తాను డబ్బుల కోసం కక్కుర్తి పడి జాతకాలు, పూజలు చేయించడం లేదని అన్నారు. తన వద్ద రాజకీయ ప్రముఖులు క్లైంట్స్ గా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు పూజలు చేసినందుకు ఒక్క హీరోయిన్ దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని అన్నారు. ఒక్క రష్మిక మందాన మాత్రం డబ్బులు ఇచ్చారని వేణు స్వామి చెప్పుకొచ్చారు.