Homeఆంధ్రప్రదేశ్‌Nara Bhuvaneswari Heritage: చూసిందే నమ్మండి హెరిటేజ్ పై నారా భువనేశ్వరి ఎమోషనల్!

Nara Bhuvaneswari Heritage: చూసిందే నమ్మండి హెరిటేజ్ పై నారా భువనేశ్వరి ఎమోషనల్!

Nara Bhuvaneswari Heritage: టీటీడీ నెయ్యి కల్తీ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి హెరిటేజ్( Heritage diary) సంస్థ వైపు మళ్ళింది. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్ ను తెరపైకి తెచ్చినట్లు అర్థమవుతోంది. కేవలం ఇండాపూర్ డైరీ నుంచి కొన్ని రకాల పదార్థాల తయారీకి సంబంధించి ఉత్పత్తుల ఒప్పందం ఉండడంతో.. హెరిటేజ్ పై ప్రచారం చేయడం మొదలుపెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏడాది కాలంగా ఈ వివాదం నడుస్తుండగా.. ఇండాపూర్ డైరీ ని ముందుకు తెచ్చి.. హెరిటేజ్ తో లింక్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హెరిటేజ్ సంస్థ పై వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై హెరిటేజ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి స్పందించారు. చూసిందే నమ్మండి అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఆమె భావోద్వేగంగా మాట్లాడారు.

* ట్వీట్ సారాంశం ఇదే
రాజకీయాల కోసం హెరిటేజ్ పై బురద జల్లవద్దు అని విజ్ఞప్తి చేశారు నారా భువనేశ్వరి( Nara Bhuvaneswari ). ” 33 సంవత్సరాలుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తున్నాం. ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్. నాలుగు కోట్ల రూపాయలతో చిన్న సంస్థగా తమ ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు నాలుగు వేల కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగాం. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తరువాతే మీ ఇంటికి చేరుతుందని భరోసా ఇచ్చాం. 500 మందికి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతుల మంచి పాల సేకరణ చేస్తున్నాం. న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం” అని నారా భువనేశ్వరి వివరించారు. తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియోను పూర్తిగా చూడాలని కోరారు. నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే చూసిందే నమ్మండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

* దశాబ్దాలుగా సేవలు..
1989లో హెరిటేజ్ ను ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు( CM Chandrababu). తాను రాజకీయాల్లో ఉండడంతో ఆ బాధ్యతలను తన భార్య భువనేశ్వరికి అప్పగించారు. పాడి రైతుల ఆదరాభిమానాలతో.. కొనుగోలుదారులతో హెరిటేజ్ తన వ్యాపారాన్ని గణనీయంగా విస్తరించుకుంది. దాదాపు తొమ్మిది రాష్ట్రాల్లో హెరిటేజ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే గత మూడున్నర దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన హెరిటేజ్ వ్యాపారాలకు ఇబ్బంది కలగలేదు. ఇబ్బందులు పెట్టలేదు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్ ను టార్గెట్ చేసుకుంది. వైసిపి హయాంలో నెయ్యి కల్తీ జరిగిందన్న నిర్ధారణ జరిగింది. ఇటువంటి సమయంలో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిన్న పాయింట్ను తీసుకుంది. సాధారణంగా డైరీలు పరస్పరం ఉత్పత్తులను పంచుకుంటాయి. పాలతో పాటు ఆహార ఉత్పత్తులు హెరిటేజ్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండాపూర్ డైరీ నుంచి కొన్ని రకాల ఆహార ఉత్పత్తులను తీసుకుంటుంది హెరిటేజ్. అయితే ఇండాపూర్ హెరిటేజ్ కంపెనీదేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న నారా భువనేశ్వరి స్పందించారు. ప్రస్తుతం హెరిటేజ్ కార్యకలాపాలను నారా బ్రాహ్మణి పర్యవేక్షిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version