Maruthi Swift New Car: మారుతి కంపెనీ నుంచి రిలీజైన కార్ల వెరీ ఇంప్రెస్ గా ఉంటాయని కొందరి అభిప్రాయం. అందుకే ఈ కంపెనీ నుంచి వచ్చిన ఏ మోడల్ అయినా దాదాపుగా సక్సెస్ అవుతుంది. వీటిల్లో స్విప్ట్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. రెండేళ్ల కిందట మార్కెట్లోకి వచ్చిన స్విప్ట్ ఇప్పటికే టాప్ రేంజ్ లోనే అమ్మకాలు ఉన్నాయి. అయితే ఇటీవల స్విప్ట్ ధరలు పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ధరల్లో భారీ తేడాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో స్విప్ట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో స్విప్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మారుతి స్విప్ట్ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందలుో 89 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఇది లీటర్ పెట్రోల్ కు 22.38 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం దీనిని రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.మారుతి స్విప్ట్ నెక్ట్స్ జనరేషన్ త్వరలో విడుదల కానుంది. దీని క్రాష్ టెస్ట్ ను కూడా ఇటీవల ఉపయోగించారు. అయితే చాలా మంది పాత స్విప్ట్ ను కొనాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కారు ధర ఎంత ఉందో ఒకసారి పరిశీలిద్దాం..
కార్ల ధరలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరలను పరిశీలిస్తే హైదరాబాద్ లో స్విప్ట్ ఆన్ రోడ్ ప్రైజ్ రూ.7.14 లక్షల ప్రారంభ ధర ఉంది. టాప్ ఎండ్ లో రూ.10.69 లక్షల వరకు విక్రయిస్తారు. ఇదే కారు ఏపీలోని విజయవాడలో ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇన్సూరెన్స్ తదితర ఖర్చులు కలిపి రూ.7.17 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. ఏపీలోని విశాఖ పట్నంలోనూ ఇదేప్రైసెస్ తో విక్రయిస్తున్నారు.
మరికొన్ని నెలల్లో స్విప్ట్ జనరేషన్ అందుబాటులోకి రానుంది. పాత స్విప్ట్ లోని కొన్ని మార్పులతో పాటు ఆధునాతన టెక్నాలజీని అమర్చారు. ఈ నేపథ్యంలో కొత్త కారు సైతం ఇంచు మించు రూ. 7 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు విక్రయించే అవకాశం ఉన్నందున కొత్త మోడల్ కోసం వెయిట్ చేసేవారు కొందరున్నారు. అయితే ధరలు ఆయా ప్రాంతాలను బట్టి మారే అవకాశాలు ఉన్నాయి.