Venu Swamy
Venu Swamy: వేణు స్వామి ఇటీవల తీవ్ర చట్టపరమైన చిక్కులు ఎదుర్కొన్నాడు. నాగ చైతన్య-శోభితలను ఉద్దేశిస్తూ వేణు స్వామి జాతకం పేరిట అనుచిత కామెంట్స్ చేశాడు. మరోసారి నాగ చైతన్యకు విడాకులు తప్పవు. రానున్న మూడేళ్ళలో శోభిత-నాగ చైతన్య విడిపోతారు. ఒక అమ్మాయి కారణంగా మనస్పర్థలు వస్తాయి. నాగ చైతన్యకు జాతకం ప్రకారం పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ, అభిమానుల మనోభావాలు దెబ్బ తీశాడు. హీరో నాగార్జున సీరియస్ కావడంతో పాటు వేణు స్వామిపై లీగల్ యాక్షన్ తీసుకున్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం వేణు స్వామికి వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై సెలెబ్స్ జాతకాలు నేను చెప్పను. ఎలాంటి కామెంట్స్ చేయను అన్నాడు. ఎన్నికల ఫలితాల విషయంలో వేణు స్వామి జాతకం రివర్స్ అయ్యింది. అప్పుడు కూడా ఓపెన్ గా జాతకాలు చెప్పడం మానేస్తున్నా అంటూ.. మళ్ళీ మొదలెట్టాడు. అల్లు అర్జున్-సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న నేపథ్యంలో, వేణు స్వామి ఇందులో తలదూర్చాడు. అల్లు అర్జున్ జాతకం అంటూ కొత్త రాగం అందుకున్నాడు.
వచ్చే ఏడాది మార్చి వరకు అల్లు అర్జున్ కి ఇబ్బందులు తప్పవంటూ కీలక కామెంట్స్ చేశాడు. అలాగే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి రేవతి కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేశాడు. ఈ విషయాన్ని ప్రచారం చేసుకున్నాడు. కొన్నాళ్లు వేణు స్వామి గురించి మీడియాలో ఎలాంటి వార్తలు రాలేదు. దాంతో ఎక్కడ గుర్తింపు కోల్పోతానో అనుకున్న వేణు స్వామి.. కొత్త రాగం అందుకున్నాడు. రేవతి మృతి కేంద్రంగా అల్లు అర్జున్-తెలంగాణ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదాన్ని తన పబ్లిసిటీకి వాడుకునే ప్రయత్నం మొదలెట్టాడు.
ఇప్పటికే వేణు స్వామి అంటే ఏమిటో అర్థం చేసుకున్న జనాలు ఆయన్ని నమ్మడం లేదు. అయితే వేణు స్వామికి ఇండస్ట్రీలో కొంత వెయిట్ ఉంది. ఆయన అనేక సినిమాల పూజా కార్యక్రమాలను జరిపించారు. సినిమా ఇండస్ట్రీలో జరిగే పూజలు, ఇతర కార్యక్రమాలకు ఈయనే పండితుడు. ఒకటి రెండు సినిమాల్లో తళుక్కున కనిపించి మాయమయ్యే పురోహితుడు వంటి గెస్ట్ రోల్స్ కూడా చేశాడు. ఇక రష్మిక మందాన వంటి స్టార్ హీరోయిన్స్ ఆయన భక్తుల లిస్ట్ లో ఉన్నారు. వేణు స్వామి చేయించే పూజలను నమ్ముతారు.
Web Title: Venu swamy is trying to cash in on the allu arjun controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com