Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు.. అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా కనిపించిన వేణు స్వామి అడ్డంగా దొరికిపోయాడు. అడ్డంగా బుక్కయ్యాడు. దొరికింది సందు అనుకొని అతడిని ఓ పూజారి అతడిని చెడామడా వాయించాడు. దీంతో వేణు స్వామికి ఏం చెప్పాలో తెలియలేదు. ఎలాబదులివ్వాలో అర్థం కాలేదు.
అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయానికి ఇటీవల వేణు స్వామి వెళ్ళాడు. కామాఖ్య దేవి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏవేవో పూజలు జరుగుతుంటాయని ప్రచారం జరుగుతూ ఉంటుంది. వేణు స్వామి అక్కడికి ఎందుకు వెళ్ళాడు?. వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నలను కాసేపు పక్కన పెడితే వేణు స్వామి ఆలయానికి వెళ్లడమే ఆలస్యం.. అక్కడ ఒక పూజారి వేణు స్వామిని తగులుకున్నాడు.. హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతూ వేణు స్వామిని నిలదీశాడు. దానికి వేణు స్వామి నీళ్లు నమిలాడు.. అ పూజారి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిశ్శబ్దాన్ని ఆశ్రయించాడు.
ఈ వీడియోను టీవీ5 సీఈవో మూర్తి తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేశారు. “వేణు స్వామి దొరికాడు వాయించేశాడు అని” ఒక శీర్షిక కూడా పెట్టారు. దీంతో అసలు వేణు స్వామికి ఏమైంది? అ పూజారి ఎవరు? చివరికి వేణు స్వామి లీలలు అస్సాం దాక కూడా వెళ్లాయా? అనే ప్రశ్నలు నెటిజన్ల లో వ్యక్తమవుతున్నాయి.
అప్పట్లో ఓ టాలీవుడ్ జంట విడిపోతుందని.. వారు త్వరలోనే విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోస్యం చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే ఆ టాలీవుడ్ జంట విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి వేణు స్వామి విపరీతమైన ఫేమస్ అయిపోయాడు. అతడిని ఇంటర్వ్యూ చేయడానికి యూట్యూబ్ ఛానల్స్.. ఇతర చానల్స్ పోటీ పడ్డాయి. దీంతో వచ్చిన అవకాశాన్ని వేణు స్వామి వినియోగించుకున్నాడు. పైగా తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది నటిమణులకు పూజలు కూడా చేశాడు. అప్పట్లో ఓ నటి పేరు కూడా మార్చేశాడు.
వేణు స్వామి బండారాన్ని సాక్ష్యాలతో సహా మూర్తి బయటపెట్టారు. తన పని చేస్తున్న ఛానల్లో పెద్ద డిబేట్ పెట్టి.. వేణు స్వామి అసలు బాగోతాన్ని సభ్య సమాజం ముందు ఉంచారు. ఇక అప్పటినుంచి వేణు స్వామి పెద్దగా బయట కనిపించడం లేదు. కొన్ని సందర్భాలలో క్షమాపణలు చెప్పినట్టు వార్తలు కూడా వచ్చాయి. తీరా ఇప్పుడు అస్సాంలో పూజలు చేయడానికి వెళ్లడం సంచలనం కలిగిస్తోంది. అయితే దీనిపై త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని ప్రచారం జరుగుతోంది.