Pawan Kalyan: కొంతమంది హీరోలకి భారీ క్రేజ్ ఉంటుంది. వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఇతర హీరోల హిట్ సినిమాలు ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తాయో అంతకు మించి వీళ్ళ సినిమాలు కలెక్షన్స్ ను వసూలు చేస్తాయి. అలాంటి హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు…మొదటి రోజు ఈయన సినిమా చూడడానికి ప్రతి ప్రేక్షకుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనను ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. అది సినిమాల పరంగా అయిన అవ్వచ్చు లేదా వ్యక్తిగతంగా అయినా అవ్వచ్చు… మొత్తానికైతే ఆయన అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉంటూనే, పలు శాఖలకు మంత్రి గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన సినిమాల మీద మాట్లాడిన మాటలు పట్ల ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు కొంతవరకు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కనీసం ఒక మూడు నెలల పాటు అయిన ప్రజలకు సేవలను అందించాలని చూస్తున్నాడు. వాళ్లకు ఉన్న ప్రాబ్లమ్స్ ను తెలుసుకొని వాళ్ల పనులను పూర్తి చేయాలనే ఉద్దేశ్యం తో ముందుకు కదులుతున్నాడు. ఇక దాని తర్వాతే ఆయన సినిమాల మీద తన డేట్స్ ని కేటాయిస్తానని స్పష్టంగా చెప్పాడు…
ఇక దీనివల్ల ఆయనతో సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్లకు చాలా వరకు నష్టం ఏర్పడే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘ఓజి ‘ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ బిజీలో ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకోలేకపోయారు. కనీసం ఈ సంవత్సరం ఎండింగ్ లో అయిన ఈ సినిమా వస్తుందా అంటే అది కూడా క్లారిటీగా తెలియడం లేదు. దాని వల్ల ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన డిడివి దానయ్య ఫైనాన్సర్స్ దగ్గర నుంచి ఫైనాన్స్ రూపం లో డబ్బులు తీసుకువచ్చి పెడుతున్నాడు. కాబట్టి ఆయనకు వడ్డీలు విపరీతంగా పెరిగిపోతున్నాయట.
మరి దీని వల్ల ప్రొడ్యూసర్స్ కి ఎంత లాభం వచ్చినా కూడా అవన్నీ వడ్డీల రూపంలో ఫైనాన్షియర్స్ కే వెళ్లిపోతాయి. కాబట్టి ప్రొడ్యూసర్స్ కి మిగిలేది ఏమీ ఉండదని వాళ్లు ఆలోచిస్తున్నారు. ఇక దానయ్యతో పాటుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ అలాగే ‘హరిహర వీరమల్లు’ ప్రొడ్యూసర్ అయిన ఎ ఏం రత్నం కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్లంతా కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి తమ ప్రాబ్లమ్ ని విన్నవించుకొని వీలైనంత తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేయమని తనను రిక్వెస్ట్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు అనేది…