Venu Samy: సోషల్ మీడియా లో సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వేణు స్వామి(Venu Swamy), ఈమధ్య కాలం లో బాగా సైలెంట్ అయిపోయాడు. శుభమా అంటూ పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల జంట విడిపోతుందని వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న రోజునే చెప్పి జనాల చేత చీత్కారాలను ఆదుకున్నాడు. సినీ ఛాంబర్ కి చెందిన వాళ్ళు వేణు స్వామి పై మహిళా కమీషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత వేణు స్వామి హై కోర్టు ఎక్కి తనని మహిళా కమీషన్ విచారించే హక్కు లేదని పిటీషన్ వెయ్యడం, ఆ తర్వాత హై కోర్ట్ ఆ పిటీషన్ ని కొట్టివేసి, మహిళా కమీషన్ కి విచారించే హక్కులు ఉన్నాయని చెప్పడం, వేణు స్వామి ఈ పరిణామాలు అన్నిటిని దృష్టిలో ఉంచుకొని, మహిళా కమీషన్ ముందు హాజరై క్షమాపణలు చెప్పడం, ఇదంతా మనం చూసాము.
అప్పటి నుండి ఆయన వివాదాస్పద జాతకాలు చెప్పకుండా సైలెంట్ గానే ఉంటూ వస్తున్నాడు. అయితే రీసెంట్ గానే సమంత(Samantha Ruth Prabhu), రాజ్ నిడిమోరు(Raj Nidimoru) పెళ్లి జరిగింది. గతం లో వేణు స్వామి సమంత, నాగ చైతన్య విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అది నిజం అవ్వడం తో, దానిని మార్కెటింగ్ చేసుకొని తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు సమంత రెండవ పెళ్లి గురించి మాట్లాడేందుకు ఆయన భయపడుతున్నాడు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘సమంత కి రెండవ పెళ్లి జరిగింది, ఆమె వివాహ బంధం గురించి జోస్యం చెప్పాలంటూ ఈరోజు ఉదయం నుండి నన్ను అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్లిదరు మౌఢ్యం లో పెళ్లి చేసుకున్నారు కదా, కలిసి ఉంటారా?, లేదా విడిపోతారా? అని అడుగుతున్నారు. దీనిపై నేను ఎలాంటి కామెంట్స్ చెయ్యాలని అనుకోవడం లేదు. నేను జాతకం చెప్పను. గతం లో నాగ చైతన్య, శోభిత వైవాహిక బంధం గురించి మాట్లాడినప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదురుకున్నాను. మళ్ళీ అలాంటి విషయాల్లో దూరను’ అంటూ చెప్పుకొచ్చాడు. వేణు స్వామి లో వచ్చిన ఈ మార్పుని చూసి నెటిజెన్స్ సైతం ఆశ్చర్యపోయారు.
