Homeఎంటర్టైన్మెంట్Venu Madhav NTR incident story: కమెడియన్ వేణు మాధవ్ ని అప్పట్లో ఎన్టీఆర్ కొట్టడానికి...

Venu Madhav NTR incident story: కమెడియన్ వేణు మాధవ్ ని అప్పట్లో ఎన్టీఆర్ కొట్టడానికి కారణం అదేనా..

Venu Madhav NTR incident story: మన టాలీవుడ్ లో లెజండరీ కమెడియన్స్ లిస్ట్ తీస్తే , అందులో మన వేణు మాధవ్(Venu Madhav) పేరు లేకుండా ఉండదు. ఈమధ్య కాలం లోని కమెడియన్స్ ఎంత కామెడీ చేసిన ఆర్టిఫీషియల్ గానే ఉంటుంది కానీ , వేణు మాధవ్ కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. రైటింగ్ గొప్పగా లేకపోయినా కూడా తన కామెడీ టైమింగ్ తో సన్నివేశాన్ని పండించగల సత్తా ఉన్న అతి తక్కువ మంది కమెడియన్స్ లో వేణు మాధవ్ కూడా ఒకరు. కేవలం కామెడీ మాత్రమే కాదు , సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండించగలడు వేణు మాధవ్. అందుకే అప్పట్లో వేణు మాధవ్ లేకుండా సినిమా విడుదల అయ్యేది కాదు, దాదాపుగా 780 సినిమాల్లో ఆయన కమెడియన్ గా నటించాడు. హీరో గా కూడా పలు సినిమాల్లో నటించాడు. అలాంటి గొప్ప కమెడియన్ లేని లోటు ప్రస్తుతం మన ఇండస్ట్రీ లో స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే అప్పట్లో వేణు మాధవ్ ని సీనియర్ ఎన్టీఆర్ ఎగిరి కాళ్లతో కొట్టాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?.. అదేంటి వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా పని చెయ్యలేదు కదా , వేణు మాధవ్ ని కొట్టే ఛాన్స్ సీనియర్ ఎన్టీఆర్ కి ఎలా వచ్చింది అని మీరు అనుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ముందు , వేణు మాధవ్ ఒక తెలుగు దేశం పార్టీ కార్యకర్త. ఎన్టీఆర్ సీఎం గా పని చేస్తున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వేణు మాధవ్ వాచ్ మెన్ గా పని చేసేవాడు. అంతే కాదు , ఆ కార్యాలయానికి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం కూడా వేణు మాధవ్ డ్యూటీ. అయితే వేణు మాధవ్ కి ఎన్టీఆర్ కి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి గతం లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు వేణు మాధవ్.

ఆయన మాట్లాడుతూ ‘అన్న గారు ఎన్టీఆర్ సీఎం గా పని చేస్తున్న రోజుల్లో నేను తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వాచ్ మెన్ గా పని చేసేవాడిని. ఒక రోజు ఎన్టీఆర్ గారు ఉదయం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు. మమ్మల్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పారు. ఎన్టీఆర్ ప్రెస్ మీట్ 4 గంటలకు అంటే మేము 2 గంటలకే నిద్ర లెయ్యాలి. నేను ఆ సమయానికి నిద్ర లేచాను. అప్పుడే ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ క్యాన్సిల్ అని చెప్పారు. తిరిగి వెళ్తున్న సమయం లో ఆ లైట్ వేసింది ఎవరు అని అడిగారు. అప్పుడు నేనే సార్ 2: 30 గంటలకు లేచాను కదా అందుకే వేశాను అని చెప్పాను. అప్పుడు ఎన్టీఆర్ నన్ను పిలిచి ఒక్క యూనిట్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని బాగా తిట్టు , నన్ను కాళ్లతో కొట్టాడు. అనంతరం మళ్లీ పిలిచి , దోశ తినిపించి, ఇంకా ఏమైనా కావాలంటే తిని వెళ్ళండి అన్నారు. గుర్తుంది కదా, ఇక మీదట ఎలా ఉండాలో అని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చాడు వేణు మాధవ్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version