Venky Atluri Web Series: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు చాలామంది హీరోలు వినూత్నమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరు వెబ్ సిరీస్ వైపు ఎందుకని మొగ్గు చూపిస్తున్నారు అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇక కుర్ర దర్శకుల నుంచి స్టార్ డైరెక్టర్ల వరకు వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు సైతం సిద్దు జొన్నలగడ్డను హీరోగా పెట్టి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సిరీస్ తో తన వర్క్ చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సిరీస్ ఆయన ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే ఈ సిరీస్ ద్వారా ఆయన జనానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి వెంకీ అట్లూరి గత రెండు సినిమాల నుంచి తన పంథా ను పూర్తిగా మార్చేశాడు. ప్రేక్షకులను హుక్ చేసే కథలు తీసుకుని దాన్ని గ్రిప్పింగ్ గా రాసుకొని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
అందులో భాగంగానే ఆయన సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి సూర్య తో చేస్తున్న విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు… ఆయన చేస్తున్న ఈ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని సాధించాలని చాలామంది అభిమానులు సైతం కోరుకుంటున్నారు… ఇక ఆయన ఇటు సినిమాలు చేసుకుంటునే వెబ్ సిరీస్ లను కూడా చేస్తున్నాడు.
నిజానికి సినిమాలు చేస్తు వెబ్ సిరీస్ చేయడం వల్ల వాళ్ళ క్రేజీ ఏమైనా తగ్గిపోయే అవకాశం ఉందా అని మరి కొంతమంది అభిమానులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్న క్రమంలో వెబ్ సిరీస్ అంటే మినిమం ఎంగేజింగ్ గా ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోయి ఈ సిరీస్ ను చూడడానికి అవకాశమైతే ఉంటుంది. అందుకే వెంకీ అట్లూరి తను రాసుకున్న పాయింట్ ను స్ట్రెయిట్ గా చెప్పడానికి వెబ్ సిరీస్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది…
