Venky Atluri and Surya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన చేసిన చాలా సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. రీసెంట్గా ఆయన లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు సూర్య హీరోగా మరొక కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా బ్యాంక్ రాబరీ నేపథ్యంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి సూర్య (Surya) ఇప్పటివరకు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు తెలుగులో ఉన్న హీరోలను కాదని పరభాష హీరోలను ఎంచుకొని వాళ్లతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన కెరియర్ లోనే ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు గా నిలిచిపోయాయి. ప్రస్తుతం సూర్య తో ఈయన చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియాలో గొప్ప విజయాన్ని సాధిస్తే ఆ తర్వాత ఆయన మరో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు హీరోలు అతన్ని పట్టించుకోకపోవడంతో ఆయన ఇతర భాషల హీరోలతో సినిమాలని చేస్తూ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ధనుష్(Dhanush)తో చేసిన సార్ (Sir) సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా దర్శకుడిగా ఆయనకు ఒక మంచి ఐడెంటిటి క్రియేట్ చేసి పెట్టింది.
ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన లక్కీ భాస్కర్ (Lucky Bhaksr) సినిమా అతన్ని అమాంతం స్టార్ డైరెక్టర్ గా మార్చేసిందనే చెప్పాలి… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటిలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ను చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. కానీ అందులో కొన్ని సక్సెస్ లు సాధిస్తే మరికొన్ని ఫెయిల్యూర్ గా నిలిచాయి… ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…