Heroes : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించడం అంటే అంత ఆషామాషి వ్యవహారమైతే కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ప్రేక్షకులందర్నీ మెప్పిస్తూ తమకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన హీరోలకు అవకాశాలు ఈజీగా వస్తాయి. కానీ స్వతహాగా ఇండస్ట్రీ లో ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో ఒక అవకాశాన్ని అందుకోవాలంటే అది కత్తి మీద సాము లాంటిదే… అందులో ఒదిగిపోయి నటించి తనను తాను ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు పాత్రలో రాణిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పడుతున్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళందరూ చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి…ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోల కోసం పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదగడమే కావడం విశేషం. ఇక ఇలాంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయబోయే సినిమాల కోసం డిఫరెంట్ గెటప్పుల్లో కనిపిస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఫిదా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ హీరోలందరు దాదాపు మంచి గుర్తింపును సంపాదించుకున్నవారే కావడం విశేషం…ఇక ప్రభాస్ ను మినహాయిస్తే మిగిలిన హీరోలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనడం వీళ్ళందరిలో ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ (Perfect Husbend) ఎవరు అనే విషయం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి.
Also Read : ఈ సమ్మర్ కి పెద్ద హీరోలెవ్వరు రావడం లేదా..? వేసవిని లైట్ తీసుకుంటున్న స్టార్ హీరోలు…
రామ్ చరణ్(Ram Charan, ఎన్టీయార్ (NTR), అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి నటులు బెస్ట్ హస్బెండ్స్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి వీళ్ళ అందరికంటే కూడా మహేష్ బాబు ‘ది బెస్ట్ హస్బెండ్’ గా తనకంటూ ఒక సూపర్ ఐడెంటిటిని సంపాదించుకున్నాడు.
ఈ విషయంలో సరిలేరు నీకెవ్వరు అనే అంతలా మంచి పేరు ప్రఖ్యాతలను పొందిన మహేష్ బాబు తన వైఫ్ అయిన నమ్రత తో ఇంతవరకు ఎప్పుడు ఒక చిన్న గొడవ కూడా పెట్టుకోలేదట… కారణం ఏదైనా వాళ్లది లవ్ మ్యారేజ్ కావడంతో నమ్రత నిర్ణయాలకు మహేష్ బాబు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె చేసే ప్రతి పనిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడట.
ఇక ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గొడవ కూడా తలెత్తిన సందర్భాలు లేవని చెప్పడంలోనే వీళ్లిద్దరి మధ్య ఎలాంటి అండర్ స్టాండింగ్ ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే మహేష్ బాబు ది బెస్ట్ హస్బెండ్ గా ఇప్పటికీ కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read : పీపుల్స్ మీడియా బ్యానర్ ను కాపాడాల్సిన బాధ్యత ఆ స్టార్ హీరో మీద మాత్రమే ఉందా..?