Venky Atluri And Naga Chaitanya: టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే వెంకీ అట్లూరి(Venky Atluri) పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇతని కెరీర్ ‘స్నేహ గీతం’ అనే చిత్రంతో మొదలైంది. ఈ చిత్రానికి కేవలం ఆయన డైలాగ్స్ రైటర్ గానే పని చేసాడు. ఆ తర్వాత ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ అనే చిత్రానికి కూడా డైలాగ్స్ రాసాడు. ఈ రెండు చిత్రాల తర్వాత దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన ‘కేరింత’ అనే చిత్రానికి కథని అందించాడు. ఈ చిత్రం తో ఆయన ఆడియన్స్ దృష్టిలో,నిర్మాతల దృష్టిలో పడ్డాడు. అలా ఆయనకు వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ చిత్రాన్ని తీసే అవకాశం కలిగింది. ఇదే డైరెక్టర్ గా ఆయన మొదటి సినిమా. ‘ఫిదా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న వరుణ్ తేజ్ కి, ఆ వెంటనే ‘తొలిప్రేమ’ చిత్రంతో మరో హిట్ ని అందుకునే అవకాశం కలిగింది.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
ఇక ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలు కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్స్ గా మిగిలాయి. కానీ ఈ చిత్రం తర్వాత ఆయన తన రూట్ ని మార్చి పక్క రాష్ట్రాల హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ ట్రెండ్ లో భాగంగా తమిళ హీరో ధనుష్(Dhanush) తో ‘సార్’ అనే చిత్రం చేసాడు. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత మలయాళం స్టార్ హీరోలలో ఒకరైన దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో ‘లక్కీ భాస్కర్’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యింది. దీంతో వెంకీ అట్లూరి కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) తో ఒక సినిమా చేస్తున్నాడు.
అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ,నా చివరి 5 చిత్రాల కథలను ముందుగా అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) గారికి వినిపించాను. కానీ ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా డేట్స్ సర్దుబాటు అవ్వక కుదర్లేదు. భవిష్యత్తులో కచ్చితంగా సినిమా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘తండేల్’ చిత్రానికి ముందు నాగ చైతన్య చేసిన ‘థాంక్యూ’, ‘కస్టడీ’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. నాగ చైతన్య కెరీర్ మీద కూడా ఈ సినిమాలు ప్రభావం చూపించాయి. వాటి బదులు ఆయన ‘లక్కీ భాస్కర్’, ‘సార్’ వంటి చిత్రాలు చేసుంటే నేడు వేరే లెవెల్ లో ఉండేవాడని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. బ్యాడ్ లక్ అంటే ఇలాగే ఉంటుంది మరి.