Andhra King Taluka Release Date: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంక్రాంతి తర్వాత మంచి సీజన్ ఏదైనా ఉందా అంటే అది ‘దసరా’ సీజన్. కేవలం ఒక సినిమా కాదు, రెండు మూడు సినిమాలు విడుదలయ్యే పెద్ద సీజన్ ఇది. ఈ ఏడాది దసరా సీజన్ కి పోటీ మామూలు రేంజ్ లో లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని భారీ రేంజ్ లో ప్రారంభించబోతున్నారు. ఇదే తేదీన నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం కూడా విడుదల కాబోతుందని, ఆ చిత్రం టీజర్ ద్వారా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా అప్పటికి రెడీ అవుతుంది అనే నమ్మకం ఎవరిలోనూ లేదు.
Also Read: సుజీత్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
ఈ రెండు సినిమాలు కాకుండా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర'(Viswambhara Movie) చిత్రం కూడా ఈ తేదీన విడుదల చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ‘ఓజీ’ చిత్రం ఏ కారణం వల్ల అయినా ఆలస్యం అయితే విశ్వంభర ని సెప్టెంబర్ 25 న విడుదల చెయ్యాలని చూస్తున్నారు. మరో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘ఓజీ’ టీం తో ‘విశ్వంభర’ టీం చర్చలు జరుపుతుందని, సెప్టెంబర్ 25 నుండి ఓజీ ని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఎంత వరకు నిజమో చూడాలి. అయితే ఇదే సెప్టెంబర్ 25 తేదీని యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కూడా టార్గెట్ చేసాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంద్ర కింగ్ తాలూకా'(Andhra King Thaaluka) ని సెప్టెంబర్ 25 న విడుదల చెయ్యాలని చూస్తున్నారు. దీని పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు.
అయితే ప్రాక్టికల్ చూస్తే ‘ఓజీ’ చిత్రానికి ఓటీటీ డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయి చాలా కాలం అయ్యింది. ‘అఖండ’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రాలకు ఇంకా ఓటీటీ డీల్స్ పూర్తి అవ్వలేదు. కాబట్టి ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 25 న విడుదలయ్యే అవకాశాలు ప్రస్తుతానికి చాలా తక్కువ. కానీ ‘విశ్వంభర’ చిత్రానికి ఓటీటీ డీల్ లాక్ అయ్యింది. కాబట్టి ‘ఓజీ’, ‘విశ్వంభర’ చిత్రాల్లో ఎదో ఒకటి కచ్చితంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘ఓజీ’ ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబర్ 25 నే విడుదల అవుతుందట. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రాంతాల ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగాయి. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 200 కోట్ల రూపాయలకు జరిగింది. ఇంత బిజినెస్ జరిగిన చిత్రాన్ని వాయిదా వేస్తే కోట్లలో నష్టం జరుగుతుంది. కాబట్టి నిర్మాత దానయ్య ఆ తేదీ నుండి ముందుకు కానీ, వెనక్కి కానీ జరిగే ఆలోచనలో లేదట.