Venky Atluri : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri)…ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించి పెడుతున్నాయి అలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకు ఎలాంటి గుర్తింపు లభించబోతుంది అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి… ఆయన ధనుష్ (Dhanush) చేసిన సార్ (Sir) సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) తో చేసిన లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే వెంకీ అట్లూరి ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి ఆయన సూర్య తో సినిమా చేయాల్సింది. కానీ సూర్య నుంచి డేట్స్ రాకపోవడంతో మరొక హీరో తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : తెలుగు హీరోలను పక్కన పెట్టేస్తున్న స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి! కారణం అదేనా?
ఇక రీసెంట్ గా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే సినిమాతో మంచి విజయాన్ని సాధించిన అజిత్ (Ajeeth) సైతం వెంకీ అట్లూరి తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసమే ఒక స్క్రిప్ట్ రెడీ చేయమని అజిత్ వెంకీ కి చెప్పినట్టుగా తెలుస్తోంది.
మరి ప్రస్తుతం వెంకీ అట్లూరి ధనుష్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో అజిత్ తో సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తాడా? ఆయన అడిగినట్టుగా కథను రెడీ చేసి ఆయనతో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయగలుగుతాడా? లేదాఅనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న దర్శకులు చాలామంది ఉన్నారు.
అయినప్పటికి వెంకీ అట్లూరి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మాత్రం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రిలో ఉన్న ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే వెంకీ ఎలాంటి దర్శకుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటు వస్తున్నాయి.
Also Read : వెంకీ అట్లూరి కి హ్యాండ్ ఇచ్చిన స్టార్ హీరోలు వీళ్లేనా.?