https://oktelugu.com/

అప్పటి ముచ్చట్లు : ఎన్టీఆర్ లో వెంకటేశ్వర స్వామి కనిపించారట !

ఆ రోజుల్లో అనగా డెబ్బై ఏళ్ల క్రితం.. అప్పుడప్పుడే ఎన్టీఆర్ అనే కుర్రాడు.. తెలుగు సినిమాకి రారాజుగా మారుతున్న రోజులు అవి. ఆలాంటి ఎన్టీఆర్ ఒకరోజు ఒక మేకప్ మెన్ ను చూశారు. ఆ మేకప్ మెన్ పనితనానికి ఎన్టీఆర్ ముగ్దులయిపోయారు. ఆ తరువాతే ఆ మేకప్ మెనే ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ అయ్యారు. ఆయనే ఎం పీతాంబరం. అసలు ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు ధరిస్తే, ఆ గెటప్ తాలూకు కటౌట్లకు థియేటర్ల వద్ద పాలాభిషేకాలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 1, 2021 / 01:33 PM IST
    Follow us on


    ఆ రోజుల్లో అనగా డెబ్బై ఏళ్ల క్రితం.. అప్పుడప్పుడే ఎన్టీఆర్ అనే కుర్రాడు.. తెలుగు సినిమాకి రారాజుగా మారుతున్న రోజులు అవి. ఆలాంటి ఎన్టీఆర్ ఒకరోజు ఒక మేకప్ మెన్ ను చూశారు. ఆ మేకప్ మెన్ పనితనానికి ఎన్టీఆర్ ముగ్దులయిపోయారు. ఆ తరువాతే ఆ మేకప్ మెనే ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ అయ్యారు. ఆయనే ఎం పీతాంబరం. అసలు ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు ధరిస్తే, ఆ గెటప్ తాలూకు కటౌట్లకు థియేటర్ల వద్ద పాలాభిషేకాలు జరిగేవి అంటేనే ఎం. పీతాంబరం కృషి ఎంతో ఉందని అర్ధం. నిజానికి ఎన్టీఆర్ కంటే ముందు ఎంజీఆర్ కు వ్యక్తిగత మేకప్ మ్యాన్ గా ఉండేవారు పీతాంబరం.

    Also Read: పూరి జగన్నాథ్ బెస్ట్ ఇయర్ 2020నేనట తెలుసా?

    అయితే, ఎంజీఆర్ తో మంచి స్నేహంగా ఉండే ఎన్టీఆర్, ఒకసారి ఆయనను చూసేందుకు వెళ్ళినప్పుడు పీతాంబరంతో మేకప్ చేయించుకుంటున్నారు ఎంజీఆర్. ఆరోజు పీతాంబరం పనితనం చూసిన ఎన్టీఆర్, తనకు కూడా వ్యక్తిగత మేకప్ మ్యాన్ గా పనిచేయమని పీతాంబరాన్ని కోరారట. నాటి నుంచి అటు పీతాంబరంకు కూడా తన పనితనం చూపించుకోడానికి, ఎన్టీఆర్ వంటి అద్భుతమైన రూపం దొరికింది. ఇక వీరిద్దరి కలయిక ప్రేక్షకులకు కనువిందే అయ్యింది.

    ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా తయారు చేసేందుకు పీతాంబరం చాలా కష్టపడేవారట. పది మంది సహాయకులు బ్లూ పేస్టును కలిపి ఇస్తుంటే, ఎన్టీఆర్ శరీరమంతా దాన్ని పూసేటప్పటికి, పీతాంబరం వేళ్ళన్నీ నొప్పులు పుట్టేవట. అయితేనేం పూర్తి మేకప్ అయ్యాక ఎన్టీఆర్ ను చూసాక ఆ నొప్పులన్నీ మటుమాయమయ్యేవని ఆయన అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచారు. అయితే ఒకసారి, ఎన్‌టిఆర్‌ కు మేకప్‌ చేసాక పీతాంబరంకు ఒక విచిత్రమైన అనుభూతి కల్గింది. పి. పుల్లయ్య చిత్రం శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం షూటింగ్‌లో చివరాఖరిలో ఎన్‌టిఆర్‌కు శ్రీ వేంకటేశ్వరునిలా మేకప్‌ పనిలో పీతాంబరం, ఆయన సహాయకుడు భద్రయ్యలు పరమ నిష్టతో మేకప్‌ చేసారు.

    Also Read: ట్రైలర్ టాక్: ‘క్రాక్’ పుట్టించిన రవితేజ

    అంతే ఎన్‌టిఆర్‌ అచ్చు గుద్దినట్టు శ్రీవేంకటేశ్వరునిలా కన్పించేసరికి మేకప్‌ కిట్టు వదిలేసి ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవింద అని ఎన్టీఆర్‌ కాళ్లను చుట్టేసారు. అప్పుడు ఆ ఇద్దరిని సిబ్బంది అతికష్టంమీద పక్కకు చేర్చారు. చాలాసేపు మగతలోకి వెళ్లిపోయారు. స్వయంగా తమ చేతులతో తీర్చిదిద్దిన వారికే అలాంటి భ్రమ కలిగిందంటే… ప్రేక్షకులను ఎన్టీయార్ ఇంకెంత ప్రభావితం చేసి ఉంటారు అర్ధం చేసుకోవచ్చు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్