Venkatesh Daughter Engagement: వెంకటేష్ దగ్గుబాటి స్టార్ హీరో అయినప్పటికీ లోప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. అవసరం ఉంటే తప్ప మీడియా ముందుకు రారు. అలాగే ఆయన తన కుటుంబాన్ని పబ్లిసిటీకి దూరంగా ఉంచుతారు. వెంకటేష్ సతీమణి, పిల్లల గురించి బయట జనాలకు తెలిసింది తక్కువే. వాళ్ళు సినిమా ఈవెంట్స్ కి హాజరుకారు. వెంకటేష్ కి నలుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.
పెద్దమ్మాయి ఆశ్రిత ప్రేమ వివాహం చేసుకుంది. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో వివాహం జరిగింది. ఆశ్రిత వివాహం కూడా పెద్దగా ఆడంబరం ప్రచారం లేకుండా వెంకటేష్ నిర్వహించారు. వివాహం అనంతరం ఆశ్రిత విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఆశ్రిత ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. లైఫ్ స్టైల్, కుకింగ్, ట్రావెల్ వీడియోలో ఆశ్రిత తన ఛానల్ లో పోస్ట్ చేస్తారు.
తాజాగా రెండో కుమార్తె హయవాహిని పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడకు చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీతో వియ్యం కుదిరినట్లు సమాచారం. ఈ క్రమంలో విజయవాడలో నిశ్చితార్థం వేడుక ఏర్పాటు చేశారు. చిత్ర పరిశ్రమ నుండి అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది. చిరంజీవి, మహేష్ తో పాటు, కుటుంబ సభ్యులైన నాగ చైతన్య, రానా కూడా ఈ వేడుకలో సందడి చేశారు.
హయవాహినికి కాబోయే భర్త గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియవు. ఎంగేజ్మెంట్ వేడుక బుధవారం ముగిసింది. పెళ్లి ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. మూవీ మొఘల్ రామానాయుడు మనవరాలి ఎంగేజ్మెంట్ వేడుక ఇంత సింపుల్ గా జరగడం ఊహించని పరిణామం. ఇదిలా ఉంటే వెంకటేష్ సైంధవ టైటిల్ తో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ లో విడుదల కానుంది. శైలేష్ కొలను దర్శకుడు.
E pix ninna #Venkatesh 2nd daughter engagement lo vi#Chiranjeevi #MaheshBabu #Rana #NagaChaitanya pic.twitter.com/BVVUcSo9Bj
— ❤️HONESTU❤️ (@honestuuuu) October 25, 2023