https://oktelugu.com/

Venkatesh: విక్టరీ వెంకటేష్ అంత గొప్ప సంపన్నుడా? ఆయన ఆస్తుల విలువ తెలుసా?

రామానాయుడు స్టూడియో ఉంది. హైదరాబాద్ లో రెండు స్టూడియోలు ఉన్నాయి. వైజాగ్ లో ఓ స్టూడియో ఉంది. వీటితో పాటు లగ్జరీ కార్లు, బైక్ లు ఉన్నాయి. పైగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారట.

Written By:
  • S Reddy
  • , Updated On : March 1, 2024 / 11:39 AM IST
    Follow us on

    Venkatesh: టాలీవుడ్ టాప్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ప్రస్తుతం ఆయన ఆస్తుల గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన తెలుగు హీరోల్లోనే అత్యంత ధనవంతుడు అంటూ ప్రచారం నడుస్తోంది . ఈ క్రమంలో వేంకటేష్ కి 2200 కోట్లు ఆస్తులు ఉన్నాయని, ఆయన టాలీవుడ్ లో రెండో అతిపెద్ద సంపన్నుడు అని అంటున్నారు. అక్కినేని నాగార్జున(Nagarjuna) తర్వాత వెంకీనే నిలుస్తారని కథనాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ లో ఆయనకు కోట్ల విలువ చేసే లగ్జరీ హౌస్ ఉంది.

    రామానాయుడు స్టూడియో ఉంది. హైదరాబాద్ లో రెండు స్టూడియోలు ఉన్నాయి. వైజాగ్ లో ఓ స్టూడియో ఉంది. వీటితో పాటు లగ్జరీ కార్లు, బైక్ లు ఉన్నాయి. పైగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారట. తండ్రి రామానాయుడు నుంచి ఇది కొనసాగుతుందట. వందల ఎకరాల భూములు కొన్నట్లు తెలుస్తుంది. మద్రాసులో కమర్షియల్ ల్యాండ్స్ ఉన్నాయట. హైదరాబాద్ లో కూడా మరికొన్ని భూములు ఉన్నాయట.

    అన్న సురేష్ బాబుతో కలిసి పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. ఇద్దరు కలిసే ప్రాపర్టీస్ మైంటైన్ చేస్తున్నారని టాక్. ఇక ఎవరి ఆస్తి వారు పంచుకున్నా రెండు వేల కోట్లకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ .. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా వెంకటేష్ తన 76 వ సినిమా ఇటీవల అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి వెంకీ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

    ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు వెంకీ-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కగా, మంచి విజయం సాధించాయి. హ్యాట్రిక్ మూవీ సైతం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వెరైటీ టైటిల్ అనుకుంటున్నారట. రీసెంట్ గా సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకటేష్. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.