Venkatesh- Varun Tej Remuneration: డబ్బు వల్ల వచ్చే అనర్థాలను ఫన్నీగా చూపిస్తూ రూపుదిద్దుకున్న సినిమా ‘ఎఫ్-3’. పైగా, ఎఫ్ 2కి.. మూడింతలు వినోదం ‘ఎఫ్ 3’లో ఉంటుందని అనిల్ రావిపూడి నమ్మకంగా చెబుతున్నాడు. ఈ నమ్మకంలో నిజం ఎంత ఉందో, థియేటర్లో బొమ్మ పడ్డాకే తెలుస్తోంది అనుకోండి. అయితే, ‘ఎఫ్ 3’లో మూడింతలు ఫన్ మాట పక్కన పెడితే.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం మూడు రెట్లు ఎక్కువే,
‘ఎఫ్ 3’ సినిమాలో నటించందుకు గానూ వెంకటేష్ అక్షరాలా రూ.15 కోట్లు తీసుకున్నాడు. వెంకటేష్ కి సక్సెస్ రేట్ ఎక్కువ, పైగా స్టార్ హీరో అనే ఇమేజ్ ఉన్న హీరో. అయినప్పటికీ ఇన్నాళ్లు వెంకీ పారితోషికం ఎప్పుడూ రూ.6 కోట్లు దాటలేదు. పైగా, ‘ఎఫ్ 2’లో నటించినందుకు గానూ వెంకటేష్ తీసుకున్న పారితోషికం రూ.5 కోట్లు.
Also Read: Bigg Boss Non Stop Voting Results: బిగ్ బాస్ ఓటింగ్: విన్నర్ ఎవరో డిసైడైంది.. ఓటింగ్ లో టాప్ ఎవరంటే?
కానీ, ‘ఎఫ్ 3’కి వచ్చేసరికి వెంకీ రూ.15 కోట్లు పలికాడు. ఇటు వరుణ్ తేజ్ పారితోషికంలోనూ అనూహ్యమైన మార్పు వచ్చింది. వరుణ్ కి కూడా ఐదు కోట్లు ఇచ్చారు. ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అవ్వడంతో, ఈ సీక్వెల్ కి భారీ డిమాండ్ క్రియేట్ అయ్యింది. సహజంగా హీరోల మార్కెట్ చూసుకుని.. అందులో 70 పర్సెంట్ మాత్రమే దిల్ రాజు రెమ్యునరేషన్ ఇస్తాడు. కానీ, దిల్ రాజు ఈ సారి తన లెక్కల బోర్డర్స్ దాటేశాడు.
హీరోలకు అడిగినంత ఇచ్చేకుంటూ పోయాడు. ఎఫ్ 3 సినిమా బడ్జెట్ దాదాపుగా 48 కోట్ల వరకూ అయ్యింది. పైగా, ఈ సినిమాలో సునీల్, సోనాల్ లాంటి వాళ్ళను కూడా ఇరికించారు. అన్నిటికీ మించి పూజా హెగ్డేతో ఐటెమ్ సాంగ్ కూడా చేయించాడు. మొత్తమ్మీద ‘ఎఫ్ 3’ బడ్జెట్ లిమిట్ దాటేసింది. మరి రిటర్న్స్ పరిస్థితి ఏమిటి అనేదే ఇప్పుడు డౌట్.
‘ఆచార్య’ లాంటి భారీ సినిమాకే తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా 50 కోట్లు కలెక్షన్స్ రాలేదు. ‘ఎఫ్ 3’కి వస్తాయా ?. సినిమాలో అయితే, తమన్నా, మెహ్రీన్ ల రూపంలో ఫుల్ గ్లామర్ ను దట్టించారు. వెన్నెల కిషోర్, అలీ, రఘుబాబు రూపంలో ఫుల్ కామెడీని కూడా అద్దారు. కాబట్టి.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందనే ఆశలు ఉన్నాయి. మరి ఆ ఆశలు అడియాసలు అవుతాయా ? కాసుల పంటగా మారతాయా ? అనేది మే 27న తేలిపోనుంది.
Also Read:Jr NTR Birthday Special: ఎన్టీఆర్ సక్సెస్ వెనుక జీవితకాలపు మానసిక సంఘర్షణ ఉంది
Recommended Videos: