Bigg Boss Non Stop Akhil: బిగ్ బాస్ నాన్ స్టాప్: అఖిల్ సార్థక్ విజేత కాకపోవడానికి 15 అసలు కారణాలివీ!

Bigg Boss Non Stop Akhil: బిగ్ బాస్ ఓటీటీ క్లైమాక్స్ కు చేరింది. ఈనెల 21న బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేత ఎవరో తేలనుంది. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే బిందుమాధవి తొలి స్తానంలో.. అఖిల్ సార్థక్ రెండో స్థానంలో కనిపిస్తున్నారు. కొన్ని వెబ్ సైట్లలో అఖిల్ కు బాగా ఓటింగ్ జరిగింది. సోషల్ మీడియాలో బిందు టాప్ లో ఉంది. ఏదిఏమైనా జనాల ట్రెండ్ ను బట్టి ఈసారి బిగ్ బాస్ […]

Written By: NARESH, Updated On : May 19, 2022 12:23 pm
Follow us on

Bigg Boss Non Stop Akhil: బిగ్ బాస్ ఓటీటీ క్లైమాక్స్ కు చేరింది. ఈనెల 21న బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేత ఎవరో తేలనుంది. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే బిందుమాధవి తొలి స్తానంలో.. అఖిల్ సార్థక్ రెండో స్థానంలో కనిపిస్తున్నారు. కొన్ని వెబ్ సైట్లలో అఖిల్ కు బాగా ఓటింగ్ జరిగింది. సోషల్ మీడియాలో బిందు టాప్ లో ఉంది. ఏదిఏమైనా జనాల ట్రెండ్ ను బట్టి ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ కు తొలి లేడీ విన్నర్ గా బిందు గెలవడం ఖాయమంటున్నారు. ఈక్రమంలోనే అసలు టైటిల్ విన్నర్ అవుతాడనుకున్న అఖిల్ సార్థక్ ఎలా వెనుకబడ్డాడు? అతడు ఓటమికి అసలు కారణాలేంటి? వేటివల్ల విజేత కాలేకపోతున్నాడన్న దానిపై 15 కారణాలు ఇవీ..

Akhil

1. వచ్చిన వాళ్ళందరూ మాములు వాళ్లే, పక్కా నేనే గెలుస్తా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.
2. ముమైత్ వెళ్ళిపోయాక సరయు కదా పోవాల్సింది ? అన్న భావనలో ఉన్నాడు.
3. సరయు రెండోసారి సేవ్ అయ్యేసరికి ఆమెకి ఫాలోయింగ్ ఉందేమో, మిత్రా పోతుందేమో అనుకున్నాడు.
4. మిత్రా అందరినీ పంపేస్తూ ముందుకు వస్తుండటం చూసి బయట ఏం జరుగుతుందో అర్థం కానట్లుగా అయోమయంలో ఉన్నాడు.
5. అజయ్ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తూ అందరితో సరదాగా తిరగడం చూసి వాడు కాంపీటిషన్ అనుకున్నాడు. అజయ్ ని ” నువ్వు నాతో ఉండాలి బాధలు చెప్పుకోవాలి ” అని ఎమోషనల్ ఇప్పటైజ్ చేసాడు.

Also Read: Venkatesh- Varun Tej Remuneration: ఎఫ్3 లో వెంకీ, వరుణ్ పారితోషికం ఎంతో తెలుసా?

6. వ్వారియర్స్ అందరూ తన చుట్టూనే తిరిగితే వాడు ఒక్కడే ముందుకు వెళ్లొచ్చు అని అనుకున్నాడు.
7. ఈలోగా ఇదంతా గమనిస్తున్న బిందు మాత్రం వాడిని నామినేట్ చేస్తూనే వస్తుంది. వాడి పన్నాగం అంతా బిందుకి క్లియర్ గా అర్థమయిపోతుండటం చూసి, మరో పక్క మిత్రా అదే పనిగా అర్థం కాకుండా సేవ్ అవ్వడం చూసి, మిత్రాకి బిందు కి పడకపోవడం చూసి పావు లాగా వాడుకున్నాడు.
8. నటరాజ్ ని కూడా పదే పదే బిందు గురించి చెప్తూ అసహ్యం పెరిగేలాగా చేసాడు. నాలుగో క్లాస్ పిల్లల స్టేట్ మెంట్స్ అని ఆశుని బిందు మీద నెగెటివ్ చేసాడు.
ఒకరోజు రాత్రంతా కూర్చుని మిత్రా దగ్గర నెగటివ్ చేసాడు. స్పైన్ అని అజయ్ ని రెచ్చగొట్టాడు. ఆడ అని వాడే రెచ్చిపోయాడు.
9. ఎన్ని చేసినా బిందు పవర్ ఫుల్ గా ఎదుగుతూనే ఉండటం జీర్ణించుకోలేక శివ ని బిందు ని వేరు చేసేందుకు చూసాడు.బిందుతో ఏ చిన్న అపార్థం వచ్చినా శివని చేరదీసి మరీ నెగటివ్ చేసాడు.
10. మరోపక్క శివ కూడా స్ట్రాంగ్ గా ఎదగడం కూడా జీర్ణించుకోలేక పోయాడు.
11. హౌస్ లోకి వచ్చిన పేరెంట్స్, స్టేజి మీదకి వచ్చిన గెస్ట్ ల వల్ల బిందు ముందుందని, శివ గట్టి పోటీ అని తెలుసుకొని చిన్నాభిన్నం అయ్యాడు.
అప్పటి వరకు బయట జరిగేది అర్థం కాక చచ్చిన బుర్రకి అంతా అర్థం అయిపోయింది.

Akhil

12. బిందుని శివని డీ గ్రేడ్ చేయడానికి చాలా ట్రై చేసి విఫలం అయ్యాడు. నామినేషన్ లో కూడా శివ ఏదైనా పాయింట్ బయటపెడితే ఓవర్ లాప్ చేసి డైవర్ట్ చేసేవాడు.
13. బాబా ఎక్కడ ఏవిక్షన్ పాస్ బిందుకి ఇస్తడేమో అని ఒకరోజు రాత్రి మొత్తం అతన్ని బిందు మీద నెగటివ్ చేసాడు.
14. ఎన్ని చేసినా ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ బిందు బిందు అనడంతో బిందుయే గెలుస్తుందని అర్థం అయిపోయి రిలాక్స్ అయ్యాడు.
15. మిత్రాని ఆయుధంలాగా వాడుకుంటున్నవా అని అనసూయ ఆడిగేసరికి.. అప్పుడు వాడికి జ్ఞానోదయం అయ్యింది. వాడు చేసే పనులన్నీ జనాలకి ఈజీగా అర్థం అయిపోతున్నాయి అని. అంతే… అనసూయ వెళ్ళాక సైలెంట్ అయిపోయాడు అప్పటినుంచి.

అందరితో స్నేహంగా ఉన్నట్టు నాటకం ఆడి, అందరినీ ఎమోషనల్ గ వీక్ చేసి, చివరికి ఎలాంటి ఎమోషన్స్ లేవని చెప్పి.. ఒకొక్కరిని పంపించేసుకున్నాడు. అయినా సరే బూటకం అనేది ఎప్పుడూ గెలువదు. విధి బిందు శివ రూపంలో అఖిల్ ని కాటేసింది.

Also Read:Bigg Boss Non Stop Voting Results: బిగ్ బాస్ ఓటింగ్: విన్నర్ ఎవరో డిసైడైంది.. ఓటింగ్ లో టాప్ ఎవరంటే?
Recommended Videos Entertainment


Tags