Homeఎంటర్టైన్మెంట్Venkatesh Trivikram Movie: మరో యంగ్ హీరోయిన్ పై మనసు పడ్డ వెంకీ మామ! త్రివిక్రమ్...

Venkatesh Trivikram Movie: మరో యంగ్ హీరోయిన్ పై మనసు పడ్డ వెంకీ మామ! త్రివిక్రమ్ ఆమెను ఫిక్స్ చేశాడా?

Venkatesh Trivikram Movie: యంగ్ హీరోయిన్స్ తో జతకట్టి బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు విక్టరీ వెంకటేష్. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయం అందుకుంది. త్రివిక్రమ్-వెంకీ కాంబోలో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ ఫిక్స్ అయ్యిందట.

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు వెంకటేష్.  2025 సంక్రాంతి బరిలో దిగిన వెంకీ మామ అందరి అంచనాలు తలక్రిందులు చేశాడు. రామ్ చరణ్, బాలకృష్ణలను వెనక్కి నెట్టి సంక్రాంతి విన్నర్ అయ్యాడు. దర్శకుడు అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్నాం తెరకెక్కించాడు. విడుదలకు ముందు అనిల్ రావిపూడి వినూత్నంగా ప్రమోషన్స్ డిజైన్ చేశాడు. వెంకీతో పాటు హీరోయిన్స్ తో హిలేరియస్ ప్రమోషనల్ వీడియోలు చేయించాడు. మూవీ విజయంలో అనిల్ రావిపూడి ప్రమోషన్స్ గట్టిగా పని చేశాయి.

Also Read: Divyendu Likes in Peddi Movie : మున్నా భాయ్ తో రామ్ చరణ్..’పెద్ది’ లేటెస్ట్ ఫోటోలకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్!

సంక్రాంతికి వస్తున్నాం మూవీలో యంగ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. సీనియర్ హీరోల జాబితాలో చేరిన వెంకీ మామ వారితో కెమిస్ట్రీ బాగానే పండించారు. ఈ ముగ్గురు కాంబోలో వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయించాయి. వెంకీ పక్కన ఐశ్యర్య రాజేష్, మీనాక్షి నటిస్తున్నారన్న వార్త మొదట్లో ఆశ్చర్యానికి గురి చేసింది. విడుదలయ్యాక ఆ అనుమానాలు పటాపంచలు అయ్యాయి. కాగా వెంకీ తన తదుపరి చిత్రంలో కూడా హీరోయిన్ గా యంగ్ బ్యూటీని ఫిక్స్ చేశాడట. ఆమె ఎవరో కాదు రుక్మిణి వసంత్.

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ సెట్ అయిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు చిత్రవర్గాలు వెల్లడిస్తున్నాయి. అల్లు అర్జున్ తో మూవీ డిలే అయిన నేపథ్యంలో త్రివిక్రమ్… వెంకీతో మూవీకి సైన్ చేశాడని సమాచారం. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ని ఎంచుకున్నారట. త్రివిక్రమ్ రుక్మిణి వసంత్ కి నెరేషన్ కూడా ఇచ్చాడట. ఆమె అంగీకారం తెలిపినట్లు వినికిడి. ఆల్రెడీ ఎన్టీఆర్ తో రుక్మిణి వసంత్ మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు.

Also Read: Akiranandan in OG Movie : ఓజీ సినిమాలో కనిపించనున్న అకీరానందన్… సైలెంట్ గా వారసుడి ఎంట్రీ…

ఎన్టీఆర్-నీల్ మూవీ సెట్స్ మీద ఉండగానే రుక్మిణి వసంత్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమెకు తెలుగులో గొప్ప అవకాశాలు దక్కుతున్నాయి. ఇక త్రివిక్రమ్ రచయితగా పని చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలు వెంకటేష్ కి సూపర్ హిట్స్ ఇచ్చాయి. ఈ క్రమంలో వెంకీ-త్రివిక్రమ్ కాంబోపై అంచనాలు ఏర్పడ్డాయి.

 

RELATED ARTICLES

Most Popular