Venkatesh Remake Movies: సినీరంగంలో ఒకచోట హిట్టైన మూవీని మరో భాషలో రీమేక్ చేయడం చాలా కామన్. ఇలాంటి రీమిక్స్ సినిమాలతోనే స్టార్ గా ఎదిగిన వారు మన టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. విక్టరీ వెంకటేష్ ఎక్కువగా ఇలాంటి రీమేక్ సినిమాలను చేసి స్టార్ గా ఎదిగాడు. ఆయన రీమేక్ సినిమాలను చేస్తే ఒరిజినల్ సినిమాను కూడా మర్చి పోయే విధంగా జీవిస్తుంటారు. వెంకటేష్ నటించిన టాప్ టెన్ రీమేక్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యవంశం. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తెలుగులో తీసిన వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. అదే తమిళంలో సూర్య నటించిన ఘర్షణ మూవీని తెలుగులో రీమేక్ చేసి సంచలన విజయం సాధించాడు. ఈ సినిమాలో వెంకటేష్ నటన అద్భుతంగా ఉంటుంది. హీరో విక్రమ్ నటించిన జెమిని మూవీని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశాడు. కానీ ఈ మూవీ తెలుగులో ప్లాప్ అయింది.
Also Read: Raja Mouli: ఆ విషయంలో ‘తగ్గెదేలే’ అంటున్న జక్కన్న..!
A Wednesday అనే మూవీని తెలుగులో ఈనాడు పేరుతో సినిమా చేశాడు వెంకటేష్. తమిళంలో ఇదే మూవీకి రీమేక్ గా కమల్ హాసన్ కూడా నటించాడు. కానీ కమల్ ను మరిపించే విధంగా వెంకటేష్ యాక్ట్ చేసి చూపించాడు. బాలీవుడ్ లో హిట్ అయిన మూవీని తెలుగులో గోపాల గోపాల మూవీగా రీమేక్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా వెంకటేష్ గోపాలరావు పాత్రలో జీవించాడు. హీరో ప్రభు నటించిన హిట్ మూవీని తెలుగులో చంటి పేరుతో రీమేక్ చేశాడు వెంకటేష్. ఇది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
తమిళంలో భాగ్యరాజు నటించిన సుందరకాండను తెలుగులో రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టాడు వెంకటేష్. ఇందులో వెంకటేష్ యాక్టింగ్ కు అందరూ ఫిధా అయిపోవాల్సిందే. హిందీలో మాధవన్ నటించిన శాల కదూస్ మూవీని తెలుగులో గురు పేరుతో తీశాడు వెంకటేష్. ఇక దృశ్యం మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసి వెంకటేష్ అబ్బురపరిచాడు. ఈ మూవీ ఎన్ని సంచలన రికార్డు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక వెంకీ చివరి రీమేక్ మూవీ అయిన నారప్ప గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో వెంకటేష్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా సూపర్ హిట్ కొట్టింది. వెంకటేష్ రీమేక్స్ సినిమాలను చేసి ఒరిజినల్ కథలకు మంచి గుర్తింపు తీసుకు వచ్చాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Also Read:BJP Focus On Uttarandhra: ఉత్తరాంధ్రపై బీజేపీ ఫోకస్.. సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన కాషాయ దళం