Venkatesh Studios controvers: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానటువంటి గొప్ప గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కొంతమంది దర్శకులు పాన్ ఇండియాను షేక్ చేయాలని చూస్తుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయన్న విషయం మనందరికి తెలిసిందే. వాళ్లకు అనుకూలంగా మిగతా వాళ్ళు ఉన్నప్పుడే అన్ని సక్రమంగా జరుగుతాయి. అలా కాకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ల పైన ఉన్నవాళ్లు ఈగో గా తీసుకొని వాళ్లను సినిమా నుంచి పక్కకు తప్పించే అవకాశాలైతే ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే మార్తాండ్ కే వెంకటేష్ అనే ఎడిటర్ చాలా సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక అతనికి జడ్జ్ మెంట్ కి కూడా చాలా మంది దర్శకులు, ప్రొడ్యూసర్లు వాల్యూ ఇచ్చేవారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే మార్తాండ్ కే వెంకటేష్ అన్నపూర్ణ స్టూడియోలో తన ఎడిటింగ్ రూమ్ అయితే ఉండేదట. ఇక ఇలాంటి సందర్భంలోనే అప్పటికే ఆయన ఒక యంగ్ హీరో కి మూడు నాలుగు సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందించారట.
Also Read: వైఎస్ జగన్ కు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సంచలన ప్రశ్నలు
అయినప్పటికి ఆ హీరోని పట్టించుకోలేదని, ఆయనకు నమస్కారం చేయలేదని ఒకే ఒక్క కారణం వల్ల మార్తాండ్ కే వెంకటేష్ ని మరొక సినిమా నుంచి తప్పించారు అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న జనాలు ఎలా ఉంటారో చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి మొత్తానికైతే ఇక్కడ ఈగో క్లాశేష్ పెట్టుకోవడం కంటే అందరు కలిసి వర్క్ చేసుకుంటే మంచిది అని ఆయన చెప్పాడు.
ఎందుకంటే ఫైనల్ గా సినిమా అనేది బెస్ట్ గా వస్తే అందరికీ మంచి పేరు వస్తుంది. దర్శకుడు కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. హీరోకి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతోంది. అంతే తప్ప ఈగోలకి పోయి వాడు నాకు హాయ్ చెప్పలేదు. వీడు నాకు నమస్కరించలేదు అనే కొన్ని కారణాలవల్ల కెరియర్ని కోల్పోతున్నారనే విషయం ఇక్కడ చాలామందికి తెలియదు అంటూ ఆయన చెప్పడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది…