Brad Pitt F1 Movie Collections: ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో బ్రాడ్ పిట్(Brad Pitt) నటించిన లేటెస్ట్ చిత్రం ‘F1′(F1 Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ కి సరికొత్త సినిమాటిక్ థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించింది. ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతం అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి థ్రిల్లింగ్ అనుభూతి ఈమధ్య కాలం లో ఎప్పుడూ కలగలేదని అంటున్నారు. జూన్ 27 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 2656 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే అమెరికన్ డాలర్స్ లోకి దీనిని కన్వెర్ట్ చేస్తే 400 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు అన్నమాట.
కేవలం డొమెస్టిక్ మార్కెట్ లోనే కాదు, మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం రెండు వారాలకు కలిపి 70 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిందట. త్వరలోనే వంద కోట్ల మార్కుని కూడా ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టి నెంబర్ 1 స్థానం లో ఉన్న చిత్రం ‘అవతార్ 2’. దాదాపుగా ఈ చిత్రం 480 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత అవెంజర్స్ సిరీస్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ , స్పైడర్ మ్యాన్ సిరీస్ ఇలా ఎన్నో హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి.
Also Read: భర్తతో విడాకులంటూ ప్రచారం.. నయనతార రియాక్ట్ ఇదే
ఫ్రాంచైజ్ లో కాకుండా, సోలో మూవీ గా విడుదలై మౌత్ టాక్ తో మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం సరైన సక్సెస్ లేక ఖాళీగా ఉన్న మల్టీ ప్లెక్స్ థియేటర్స్ కి మేత వేస్తున్నది ఈ సినిమానే. కథ విషయానికి వస్తే 1990 వ సంవత్సరం లో హీరో రేసింగ్ లో పాల్గొని యాక్సిడెంట్ కి గురై తన కెరీర్ ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. 30 సంవత్సరాల తర్వాత తన రేసింగ్ టీం ఫార్ములా 1 మరోసారి రేసింగ్ లో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు హీరో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి ప్రపంచం లోనే ది బెస్ట్ రేసర్ గా పిలవబడిన వ్యక్తితో పోటీ పడుతాడు. ఈ పోటీ లో హీరో గెలుస్తాడా లేదా అనేది స్టోరీ.