Venkatesh Next Film Details: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కు చాలా మంచి గుర్తింపైతే ఉంది. శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించిన హీరో కూడా తనే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఈ సంవత్సరం ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన ఆయన రీసెంట్ గా ఒక ఈవెంట్లో పాల్గొన్నప్పుడు తన తదుపరి ప్రాజెక్టుల గురించి అనౌన్స్ చేశాడు. త్రివిక్రమ్ (Trivkram) డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను అని చెబుతూనే చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమాలో ఒక క్యామియో పోషిస్తున్నట్టుగా తెలియజేశాడు. ఇక దీంతో పాటు గా దృశ్యం 3 సినిమాలో నటిస్తున్నట్టుగా తెలియజేశాడు. ఇక వీటితో పాటుగా మరోసారి అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో మరో సినిమా చేయడానికి రంగ సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య బాబు సినిమాలో కూడా నటిస్తున్నట్టుగా చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వెంకటేష్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఏది ఏమైనా ఈ సినిమాతో వెంకటేష్ మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే 200 కోట్లకు పైన కలేక్షన్స్ ను కొల్లగొట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇకమీదట కూడా ఇదే సక్సెస్ రేట్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ఆ హీరోయిన్ ఎంత ఏడిపించినా దుల్కర్ సహనం…రానా బయటపెట్టిన నిజం…
ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాల్లో వెంకటేష్ డీసెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నాడు. తన తోటి హీరోలెవరికీ సాధ్యం కానీ రీతిలో ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
Also Read: పనులన్నీ పక్కనపెట్టి ఆ సినిమా చూస్తానన్న కోమటిరెడ్డి
ఇక ఆయన మంచి సబ్జెక్ట్స్ ఉంటే కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏదేమైనా వెంకటేష్ తో చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పుడున్న సీనియర్ హీరోలందరు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు…