Venkatesh : సోలో హీరో గా చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రూపం లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తగిలిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ని సంపాదించుకుంది. అలాంటి హిట్ తర్వాత వెంకటేష్ తన కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ముందు ఒప్పుకున్న సినిమాలను హోల్డ్ లో పెట్టాడు. ఆ తర్వాత దాదాపుగా 20 స్టోరీలు విన్నాడు, కానీ ఒక్కటి కూడా వెంకటేష్ కి నచ్చలేదు. చివరికి ఆయన మంటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read : పాన్ ఇండియన్ డైరెక్టర్ తో వెంకటేష్ తదుపరి మూవీ ఫిక్స్!
ఈ వార్త చాలా కాలం క్రితమే సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. కానీ నిన్ననే అధికారికంగా ఖరారైంది. ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ కోసం ప్లాన్ చేసాడట. ముందుగా స్టోరీ లోనే వినిపించగా , వెంకటేష్ కి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని డైలాగ్ వెర్షన్స్ తో సహా నిన్ననే వెంకటేష్ కి వినిపించాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ స్క్రిప్ట్ పట్ల వెంకటేష్ ఎంతో సంతృప్తి ని వ్యక్తపరిచాడట. ఇలాంటి వింటేజ్ సబ్జక్ట్స్ వెంకటేష్ చేసి చాలా రోజులైంది. సరిగ్గా ప్లాన్ చేసి తీస్తే మరోసారి వెంకటేష్ బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడేస్తాడని అంటున్నారు. ఈ చిత్రం 300 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం కావడంతో, పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం అవ్వడానికి కాస్త సమయం పడుతుందని త్రివిక్రమ్ చెప్పడంతో, అల్లు అర్జున్ ముందుగా అట్లీ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయ్యాడు. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ గ్యాప్ లో వెంకటేష్ తో సినిమా చేయాలని చాలా కాలం నుండి ఆయనతో టచ్ లో ఉన్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చనుంది. ఈ చిత్రానికి హారిక & హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ టీం నుండి రానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒక సినిమా చేసి, అది సంక్రాంతికి విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద జరిగే విద్వంసాన్ని ఊహించగలమా?, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత హైప్ ని క్రియేట్ చేయబోతుంది అనేది.
Also Read : వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో ‘నువ్వు నాకు నచ్చావ్ 2’ చేయబోతున్నారా..?