Sandeep Vanga and Prabhas : రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). వరుస బ్లాక్ బస్టర్స్ తో పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న సందీప్ వంగ(Sandeep Vanga) ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడమే అందుకు కారణం. అయితే ఈ సినిమా చేయడానికి సందీప్ వంగ ప్రభాస్ కి చాలా కఠినమైన నియమాలు పెట్టాడు. అదేమిటంటే ఈ చిత్రానికి ప్రభాస్ నుండి 65 రోజుల డేట్స్ కావాలి. ఈ సినిమా చేసినన్ని రోజులు, వేరే సినిమా చేయడానికి వీలు లేదు, అదే విధంగా లుక్స్ పరంగా చాలా కేర్ తీసుకోవాలి, డూప్స్ లాంటివి ఈ చిత్రానికి వాడకూడదు వంటి షరతులు పెట్టాడట. ప్రభాస్ ఒకే సమయం లో రెండు మూడు సినిమాలు చేసే రకం, కానీ ఒక్కసారిగా ఆయనకు ఇలాంటి షరతులు పెట్టేసరికి కాస్త ఇబ్బంది ఫీల్ అయినా, ఆ షరతులకు ఓకే చెప్పాడు.
అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆయన ‘రాజాసాబ్’ చిత్రం తో పాటు, హను రాఘవపూడి తో ‘ఫౌజీ’ అనే చిత్రం కూడా చేస్తున్నాడు. ఇందులో ‘రాజా సాబ్’ చిత్రం పూర్తి చెయ్యడానికి ఆయన 45 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా ‘ఫౌజీ’ ని పూర్తి చేయడానికి చాలా డేట్స్ అవసరం ఉంది. పైగా ఈ చిత్రంలో హీరోయిన్ మార్పిడి కి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, ఇప్పటి వరకు చేసిన షూటింగ్ మొత్తాన్ని రీ షూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే జరిగితే షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక, ప్రభాస్ స్పిరిట్ చిత్రానికి డేట్స్ కేటాయించినట్టు వార్తలు వినిపించాయి. సందీప్ వంగ ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ ని కూడా లాక్ చేసి పెట్టుకున్నాడు.
అయితే ఇప్పుడు సందీప్ వంగ కి ప్రభాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. స్పిరిట్ చిత్రం కంటే ముందు ఆయన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే నటించబోతుందట. ఆమె డేట్స్ కూడా ఖారారు అయ్యినట్టు .లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. అదే నిజమైతే కచ్చితంగా ‘స్పిరిట్’ చిత్రం ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో, సందీప్ వంగ మరో హీరో తో సినిమా చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అంతటి బౌండెడ్ స్క్రిప్ట్ ఆయన దగ్గర ఇప్పుడు లేదు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అనే రూమర్ మాత్రమే సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. కాబట్టి స్పిరిట్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Also Read : సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం ఇక ఎంతకాలం వెయిట్ చేయాలి…