Venkatesh IPL Video: మన టాలీవుడ్ క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న హీరోల్లో ఒకరు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh). షూటింగ్ లేని సమయాల్లో ఇండియా మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడికి వాలిపోతూ ఉంటాడు వెంకటేష్. ఇక ఐపీఎల్ సీజన్ లో ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ప్రతీ మ్యాచ్ లో పాల్గొనేందుకు చూస్తుంటాడు వెంకటేష్. నిన్న హోరాహోరీగా జరిగిన ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ , ‘ఢిల్లీ క్యాపిటల్స్’ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ 48 పరుగుల తేడా తో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కి విక్టరీ వెంకటేష్ కూడా విచ్చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లేయర్స్ తో ఫోటోలు దిగిన వెంకటేష్, మ్యాచ్ మొదలైనప్పటి నుండి పూర్తి అయ్యే వరకు అన్ లిమిటెడ్ ఎనర్జీ తో కుర్రాడిలాగా ఎంజాయ్ చేశాడు.
అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఒక వీడియో లో వెంకటేష్ పైకి లేచి ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీం జెండా పట్టుకొని చిందులు వేస్తుంటే, ఆ టీం ఓనర్ కావ్య మారన్ వెంకటేష్ ని చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టడం హైలైట్ గా నిల్చింది. ఈ వీడియో ని నెటిజెన్స్ ఒక రేంజ్ లో షేర్ చేస్తున్నారు. మీకోసం ఆ వీడియోని క్రింద అనిడిస్తున్నాము చూడండి. వెంకీ మామ చూపిస్తున్న ఎనర్జీ ని చూస్తుంటే ముచ్చట వేస్తుంది కదూ. కుర్రాళ్ళు కూడా ఈ రేంజ్ ఎనర్జీ ని చూపించలేరేమో. ఇలా వెంకీ మామ ఐపీఎల్ గ్రౌండ్స్ లో చిందులు వేయడం కొత్తేమి కాదు. తానూ ఒక పెద్ద సూపర్ స్టార్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి , ఒక సాధారణ క్రికెట్ అభిమాని లాగా వెంకటేష్ ఎంజాయ్ చేయడాన్ని చూసి , ఇది రా లైఫ్ అంటే , మనం కూడా ఇలా ఎంజాయ్ చెయ్యాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్నాడు . శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో 270 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన విక్టరీ వెంకటేష్ చేతుల్లో ఇప్పుడు ఆ రేంజ్ సినిమాలే ఉన్నాయి.
View this post on Instagram