Homeఎంటర్టైన్మెంట్Rashmi Sudigali Sudheer Viral Video: సుడిగాలి సుధీర్ గురించి రిపోర్టర్ అడగ్గానే చిరాకు పడిన...

Rashmi Sudigali Sudheer Viral Video: సుడిగాలి సుధీర్ గురించి రిపోర్టర్ అడగ్గానే చిరాకు పడిన రష్మీ.. వీడియో వైరల్..

Rashmi Sudigali Sudheer Viral Video: బుల్లితెర పై సుధీర్ , రష్మీ జంటకు యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ని చూస్తే , ఎవరైనా లవర్స్ , కాబోయే భార్య భర్తలు అంటే నమ్మేస్తారు, ఆ రేంజ్ లో ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా వీళ్లిద్దరు మేము లవర్స్ అనే విషయాన్నీ బహిరంగంగా ఇప్పటి వరకు చెప్పలేదు. అసలు రష్మీ […]

Rashmi Sudigali Sudheer Viral Video: బుల్లితెర పై సుధీర్ , రష్మీ జంటకు యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ని చూస్తే , ఎవరైనా లవర్స్ , కాబోయే భార్య భర్తలు అంటే నమ్మేస్తారు, ఆ రేంజ్ లో ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా వీళ్లిద్దరు మేము లవర్స్ అనే విషయాన్నీ బహిరంగంగా ఇప్పటి వరకు చెప్పలేదు. అసలు రష్మీ తో నేను ఫోన్ లో మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువని , కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మేమిద్దరం బుల్లితెరపై అలా జంటగా కనిపిస్తామని , అంతకు మించి ఏమి లేదని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సుధీర్ , రష్మీ కూడా అదే చెప్తూ వచ్చేది. కానీ ఆడియన్స్ మాత్రం అసలు నమ్మేవాళ్ళు కాదు. వీళ్లిద్దరు కలిసి ఒక షో లో కనిపించి ఐదేళ్లు దాటింది.

కానీ ఇప్పటికీ వీళ్ళిద్దరిని లింక్ చేస్తూ సోషల్ మీడియా లో కొన్ని పేజీలు పోస్టులు పెడుతూనే ఉంటున్నాయి. ఇకపోతే ఆహా మీడియా లో త్వరలోనే ‘ఇండియాస్ ఫస్ట్ ఎవర్ Influencer రియాలిటీ షో’ అనే ప్రోగ్రాం ప్రారంభం అవ్వబోతుంది. ఈ షో కి యాంకర్ గా రష్మీ వ్యవహరించబోతుండగా , మంచు లక్ష్మి జడ్జీగా వ్యవహరించబోతుంది. ఈ షో ప్రొమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రష్మీ , మంచు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ రష్మీ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఫీల్ అవ్వనంటే ఒక ప్రశ్న అడుగుతాను’ అని అంటాడు. అప్పుడు రష్మీ మీరు అడిగే ప్రశ్న ని బట్టీ నేను ఫీల్ అవుతానా లేదా అనేది చెప్తాను అంటుంది. ‘మీ కో యాంకర్ సుడిగాలి సుధీర్ ఎన్నో అద్భుతమైన షోస్ చేసాడు. కానీ ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టీ చూస్తుంటే మీరు అతని పేరు చెప్పడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ఇందాక మీరు సమాధానం చెప్పి ఉండుంటే గెలిచేవారు , కానీ ఎందుకు అతని పేరు తీయడం ఇష్టం లేక సమాధానం చెప్పలేదు?’ అని అడుగుతారు.

అందుకు రష్మీ సమాధానం చెప్తూ ‘ఇష్టపడలేదు అనేది కాదు , ఇప్పుడు కేవలం మనం ఒక షో గురించి మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాము , ఒక వ్యక్తి గురించి కాదు , అందుకే నేను చెప్పలేదు , అంతే తప్ప ఇష్టం లేక కాదు అనడం కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం మంచు లక్ష్మి మైక్ అందుకొని ‘మీకే బోరు కొట్టలేదా?, ఎంతసేపు సుధీర్ గురించే అడగాలా?, మీకు క్లిక్ బైట్ కోసం అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper