Drushyam 2: విక్టరీ వెంకటేశ్ హీరోగా దర్శకుడు జీతూ జేసెఫ్ తెరకెక్కించిన సినిమా దృశ్యం2. ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గతంలో వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నవంబరు 25న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది.
ఈ క్రమంలోనే వెంకీ మాట్లాడుతూ.. ఈ సినిమా చేసేటప్పుడు తాను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని.. ఎంతా సరదాగా షూటింగ్ గడిచిందని అన్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడతగ్గ మంచి సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను చేసిన రాంబాబు క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలతో.. జనం ముందుకు వస్తున్నామని.. ఆ పాత్రల్లో ఇప్పటికీ కనిపించని భయం ఉందని .. ఎప్పుడో జరిగిన హత్యకు సంబంధించిన విచారణ మళ్లీ ప్రారంభం కావడం.. పోలీసుల ఎత్తుకు రాంబాబు పై ఎత్తులు వేయడం… సినిమా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని వెంకీ అన్నారు.

తన పాత్ర గురించి చెబుతూ.. సెట్‌కు వెళ్లగానే తనలో రాంబాబు వచ్చేస్తాడని అన్నారు. తమిళ్లో ఈ పాత్ర చేసిన మోహన్‌లాల్‌ను చూసి స్టన్ అయినట్లు చె్పారు. చాలా సీన్స్‌లో హదయానికి హద్దుకునేలా పాత్రలో జీవించారని అన్నారు. ఆ తర్వాత దర్శకుడు జీతూ మాట్లాడుతూ.. ఈ సినమాకు రాజమౌళి మాస్టర్ పీస్ అనే బిరుదు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఇటువంటి మంచి సినిమాను ఎక్కువకాలం హోల్డ్‌లో ఉంచకూడదనే ఉద్దేశంతోనే అమెజాన్‌లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ప్రేక్షకులు ఇప్పటికీ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా లేరని.. అందుకే ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.