Venkatesh : ఇక ఎలాంటి క్యారెక్టర్ అయిన చేసి మెప్పించిగలిగే హీరోల్లో వెంకటేష్ మొదటి స్థానం లో ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ఏజ్ లో కూడా ఆయన వరుసగా మంచి విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సంక్రాంతి కానుకగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాని బరిలోకి దింపుతున్నాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి హిట్ ట్రాక్ ఎక్కుతాడని అతని అభిమానులు భావిస్తున్నారు. గత సంక్రాంతికి వచ్చిన సైంధవ్ సినిమాతో భారీగా నిరాశపరిచిన ఆయన ఇప్పుడు మాత్రం సూపర్ సక్సెస్ ని అందుకుంటాననే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వెంకటేష్ ఆయనలోని నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ వాళ్ళ నాన్న డాక్టర్ డి రామానాయుడు స్టార్ ప్రొడ్యూసర్ అనే విషయం మనకు తెలిసిందే. ఆయన స్టార్ ప్రొడ్యూసర్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ప్రతి సినిమా కథని ముందుగానే ఆయన జడ్జ్ చేసేవాడు. కాబట్టే ఆయన చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి మంచి సినిమాలను అందిస్తూ ముందుకు సాగాడు.
ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యేవి కానీ ఆయన చొరవ తీసుకొని వాటిని హిట్టుగా మలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో వెంకటేష్ హీరో గా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘బొబ్బిలి రాజా’ సినిమా విషయంలో ఇదే జరిగింది… సినిమా రిలీజ్ కి ఒక మూడు రోజుల ముందే ఆ సినిమాను గోదావరి జిల్లాల్లోని కొన్ని థియేటర్లలో వేసి కొంతమంది ప్రేక్షకులకు చూపించేవాడు.
అలా ప్రతి ఒక్క థియేటర్లో సామాన్య ప్రేక్షకులతో పాటు సినిమా యూనిట్ కి సంబంధించిన కొంతమందిని పెడతాడు అక్కడ ప్రేక్షకులు దేనికైతే ఎక్కువ రియాక్ట్ అవుతున్నారో ఏ సీన్లకి బోర్ గా ఫీల్ అయి కుర్చీలో నుంచి లేచిపోతున్నారు అనేది తెలుసుకునేవాడు అలా అన్ని చోట్ల నుంచి వచ్చిన కొన్ని కామన్ బోరింగ్ సీన్స్ ని సినిమాలో లేకుండా ఫైనల్ ఎడిట్ లో దాన్ని కట్ చేయించేవాడు. అలాగే సినిమా సంబంధించిన సీన్లలో ఏ సీను కైతే వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారో ఆ సీన్ ని ఇంకా బలంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని పెట్టించే విధంగా ప్రణాళికలు చేసేవాడు.
అలా చేయడం వల్లే ‘బొబ్బిలి రాజా’ సినిమా సూపర్ సక్సెస్ అయిందని ఇప్పటికి వెంకటేష్ కూడా చెబుతూ ఉంటాడు. ఇక ఈ ఒక్క సినిమానే కాకుండా కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, కలిసుందాంరా లాంటి మూవీస్ విషయంలో రామానాయుడు అలాంటి పద్ధతినే ఫాలో అయ్యాడు. అందుకే అతనికి మంచి విజయాలు దక్కడమే కాకుండా ఆయనను టాప్ ప్రొడ్యూసర్ గా నిలబెట్టాయనే చెప్పాలి…