Homeఎంటర్టైన్మెంట్Venkatesh First Look: 'మన శంకర వరప్రసాద్ గారు' నుండి వెంకటేష్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఆయన...

Venkatesh First Look: ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుండి వెంకటేష్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఆయన క్యారక్టర్ పేరు ఏమిటంటే!

Venkatesh First Look: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటిస్తున్న ‘మన శంకర వరపరసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల అవ్వగా, అందులో ‘మీసాల పిల్ల’ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈమధ్యనే విడుదలైన ‘శశిరేఖ’ పాట యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే […]

Venkatesh First Look: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటిస్తున్న ‘మన శంకర వరపరసాద్ గారు'(Mana Shankara Varaprasad garu) చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల అవ్వగా, అందులో ‘మీసాల పిల్ల’ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక ఈమధ్యనే విడుదలైన ‘శశిరేఖ’ పాట యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఆయన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సెకండ్ హాఫ్ లో వెంకటేష్ ఎంట్రీ ఉంటుందని, దాదాపుగా 45 నిమిషాల స్క్రీన్ టైం లో చిరంజీవి తో కలిసి ఒక పాట కూడా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇకపోతే నేడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. స్టైల్ గా అద్దాలు పెట్టుకొని, హెలికాఫ్టర్ నుండి దిగి రావడం, వెనకాల బాడీ గార్డ్స్ ఉండడం వంటివి చూస్తుంటే, ఆయన ఈ చిత్రంలో చాలా రిచ్ గా కనిపించబోతున్నాడని అర్థం అవుతోంది. ఈ చిత్రం లో వెంకటేష్ పాత్ర పేరు ‘వెంకీ గౌడ్’ అట. కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ క్యారక్టర్ కి తెలుగు రాదట. చిరంజీవి కి తెలుగు , ఇంగ్లీష్ తప్ప మరో బాషా రాదు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే సంభాషణ చాలా ఫన్నీ గా ఉంటుందని, ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించేలా చేస్తుందని అంటున్నారు. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మెగాస్టార్ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉండేలా ప్లాన్ చేసాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి.

ఇక మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సాంగ్ ని ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసినట్టు సమాచారం. ఇతను బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన కొన్ని డ్యాన్స్ రియాలిటీ షోస్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కి కొరియోగ్రఫీ చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు. రీసెంట్ గానే ఈయన కొరియోగ్రఫీ లో వచ్చిన ‘గిర్రా గిర్రా బొంగరానివే’ పాటకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ కూడా భారీ రేంజ్ లో పడ్డాయి. కాబట్టి ఈ పాటకు కూడా ఆయన అదిరిపోయే రేంజ్ స్టెప్పులు కంపోజ్ చేసి ఉంటారని అనుకుంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper