Venkatesh Top Senior Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు పాన్ ఇండియాలో వరుస సినిమాలను చేస్తుంటే సీనియర్ హీరోలు సైతం తెలుగు సినిమాల హవాని పెంచుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పోటీని ఇచ్చే విధంగా మన సినిమాలు ఉండడం మన కంటెంట్లు కొత్తగా ఉండటం, ప్రతి ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుండటంతో మన సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తుంది…ఇక విక్టరీ వెంకటేష్ లాంటి నటుడు సైతం తెలుగులో వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాడు. గత సంవత్సరం ‘సంక్రాంతి వస్తున్నాం ‘ సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో ఒక క్యామియో రోల్ పోషించాడు. ఈ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించాడు. ఇక మొత్తానికైతే అటు త్రివిక్రమ్ తో ఇటు అనిల్ రావిపూడి తో సినిమాలు చేస్తున్న వెంకటేష్ రెండు సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.
సంవత్సర వ్యవధిలోనే ఈ రెండు సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను అతని వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో వెంకటేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక తన సినిమా లైనప్ కూడా చాలా బాగా సెట్ చేసుకుంటున్నాడు. ఇక ఈ ఇద్దరు దర్శకుల తర్వాత తను ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద ఇంకా క్లారిటి రాలేదు.
కానీ మొత్తానికైతే పర్ఫెక్ట్ గా సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుండటంతో ప్రతి ఒక్కరు వెంకటేష్ ని అప్రిషియేట్ చేస్తున్నారు…ఇక వెంకటేష్ మూవీస్ మినిమం గ్యారంటీ సినిమాలు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు… చూడాలి మరి అవి ఎంత వరకు వర్కౌట్ అవుతాయి అనేది…
