Sankranthiki Vastunnam: శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ లో అనితర సాధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించే హీరో రావడం అసాధ్యమని అప్పట్లో అనుకునేవారు. కానీ విక్టరీ వెంకటేష్ ఆయనకీ మించిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ని సంపాదించి చరిత్ర తిరగరాశాడు. వెంకటేష్ సినిమా టీవీ లో వస్తుందంటే, ఆడవాళ్లు రోడ్డు మీద తిరిగేవాళ్లు కాదు, ఇంట్లోనే టీవీలకు అత్తుకుపోయేవారు అని అల్లు అర్జున్ ‘వేదం’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అది నూటికి నూరు శాతం నిజమేనని అనేకసార్లు రుజువు అయ్యింది. వరుసగా ఫ్లాప్స్ ఎదురుకుంటున్న ఒక హీరో కం బ్యాక్ ఇస్తే, ఆ హీరో ని మొదటి నుండి ఆదరిస్తూ వస్తున్న ఒక జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ థియేటర్స్ కి క్యూలు కడుతుంటారు. దానివల్ల రికార్డు స్థాయి వసూళ్లు వస్తుంటాయి. ప్రస్తుతం వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి అదే జరుగుతుంది.
మాస్ హీరో కం బ్యాక్ ఇస్తే మాస్ ఆడియన్స్ మొత్తం థియేటర్స్ కి క్యూలు కడుతారు. కానీ ఆ ఆడియన్స్ కి సంబంధించిన కుటుంబాలు పూర్తి స్థాయిలో థియేటర్స్ కి వచ్చి సినిమా చూసేందుకు ఇష్టపడరు. అదే ఒక ఫ్యామిలీ హీరో కం బ్యాక్ ఇస్తే మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూలు కట్టేస్తారు. హౌస్ ఫుల్స్ కారణంగా ఎన్ని థియేటర్స్ ఉన్నా సరిపోవు. అదనపు షోస్ ని షెడ్యూల్ చేయాల్సి వస్తుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఇప్పుడు అదే జరుగుతుంది. కేవలం 5 రోజుల్లోనే ఈ చిత్రం బుక్ మై షో లో ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలకు అమ్ముడుపోయిన టికెట్స్ కౌంట్ ని దాటేసింది. 5 రోజుల్లో 20 లక్షల టికెట్స్ సేల్ అయ్యాయి అట. ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఇది ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మరో అరుదైన రికార్డుని నెలకొల్పింది.
విడుదలైన రోజు నుండి నేటి వరకు ఈ సినిమాకు వరుసగా 6 రోజులు నాన్ స్టాప్ గా డబుల్ డిజిట్ షేర్ వసూళ్లు వచ్చాయట. ఈరోజు కూడా ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రేంజ్ మాస్ బ్యాటింగ్ తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2 ‘ కి కూడా జరగలేదట. భవిష్యత్తులో ఈ రికార్డుని కొట్టడం కూడా కష్టమే. రెండు దశాబ్దాలుగా సోలో హీరో గా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న వెంకటేష్ ని ఒక్కసారిగా సింహాసనం మీద కూర్చోబెట్టింది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి తర్వాత సీనియర్ హీరోలలో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన హీరో గా వెంకటేష్ చరిత్రకి ఎక్కాడు. ఇక నాగార్జున, బాలకృష్ణ వంటి వారు మిగిలి ఉన్నారు. బాలయ్య ‘అఖండ 2 ‘ తో కొట్టేస్తాడు. మరి నాగార్జున పరిస్థితి ఏమిటో చూడాలి.