Renu Desai : సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా ఉండే సెలెబ్రిటీస్ లో ఒకరు రేణు దేశాయ్. ఈమె తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వాటికి ఆమె మాజీ భర్త పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రేంజ్ లో షేర్ చేస్తూ వైరల్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు నెటిజెన్స్ చేసే కామెంట్స్ ని ఆమె తన మనసుకు తీసుకోలేదు. చాలా ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ఇంస్టాగ్రామ్ లో ఆమె తన కామెంట్స్ ని లాక్ లో పెట్టుకుంది. ఒకప్పుడు ట్విట్టర్ లో కూడా ఈమె చాలా యాక్టీవ్ గా ఉండేది. కానీ అక్కడి నెగటివిటీ ని తట్టుకోలేక డీ యాక్టీవ్ చేసి వెళ్ళిపోయింది. ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ కి మొదటి నుండి జంతువులూ అంటే చాలా ప్రేమ. ఎవ్వరూ పట్టించుకోని మూగ జీవాలకు ఆశ్రయం ఇస్తూ ఒక పెట్ సంస్థ ని కూడా తన కూతురు పేరిట స్థాపించింది.
అయితే కొంతమంది మనుషులు జంతువుల పట్ల హింసాత్మక ధోరణితో వ్యవహరిస్తే రేణు దేశాయ్ అసలు ఊరుకోదు. ఇండియన్ 2 చిత్రం లో డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ జంతువులను అవమానిస్తూ ఒక సన్నివేశం చేస్తే, దానిపై మండిపడుతూ రేణు దేశాయ్ అప్పట్లో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టింది. అంత పెద్ద లెజెండరీ వ్యక్తులనే ఆమె లెక్క చేయలేదంటే మూగ జీవాల పట్ల ఆమె కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఆమె ఫెలిసెట్ అనే పిల్లిని శాస్త్రవేత్తలు చిత్రహింసలకు గురి చేసిన విధానాన్ని ఇంస్టాగ్రామ్ లో వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ఫెలిసెట్ ఆమె పిల్లిని అంతరిక్షంలోకి పంపేందుకు ఎన్నో చిత్ర హింసలకు గురి చేసారు. రాకెట్ లో సజీవంగా ఆ పిల్లి ఉండేందుకు దానిని సిద్ధం చేయడానికి అనేక చిత్రహింసలు చేసి పంపించారు’.
‘ఒక బలమైన కంటైనర్ లో ఆ పిల్లిని కూర్చోబెట్టి, అది ఎటు కదలకుండా గట్టిగా బంధించారు. ఇది సరిపోదు అన్నట్టు ఆ పిల్లి శరీరంలోకి ఎలెక్ట్రోడ్ లను కూడా పంపించారు. వీటి ఒత్తిడిని తట్టుకొని ఆ పిల్లి అంతరిక్షంలో రెండు నెలల పాటు మన శాస్త్రవేత్తల ప్రయోగానికి ఉపయోగపడాల్సి వచ్చింది. ఇలా ఒక మూగజీవిని చిత్రహింసలకు గురి చేసే హక్కు శాస్త్రవేత్తలకు లేదు. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. రెండు నెలల పాటు ఎటు కదలకుండా, అంతరిక్షం లో ఆ పిల్లి ఎలా జీవించింది. ఆహరం లేకుండా ఇదెలా సాధ్యం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. రేణు దేశాయ్ బాధలో అర్థం ఉంది, కానీ కొన్ని సాధించాలంటే కొన్నిటిని బాధ పెట్టక తప్పదు. మనం కూర్చునే కుర్చీ కూడా ఎన్నో చెట్లను నరికి, హింసకి గురి చేసి తెచ్చిందే కదా, ఇది ఆలోచించాలి అంటూ నెటిజెన్స్ రేణు దేశాయ్ కి కౌంటర్ ఇస్తున్నారు.