Homeజాతీయ వార్తలుకరోనా కకావికలం

కరోనా కకావికలం

COVID 19దేశంలో కరోనా అలజడి సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. వైరస్ ధాటికి వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. కరోనా రోగుల మానసిక పరిస్థితి అధ్వానంగా మారుతోంది. తమ కుటుంబం ఏమైపోతుందోననే అనుమానంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆసుపత్రుల్లో పిచ్చి వారిలా మాట్లాడుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆక్సిజన్ కొరత, గదుల సమస్య వైరస్ సోకిన వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో కోవిడ్ బాధితుల్లో అలజడి రేగుతోంది. కరోనా వచ్చిన వారితో పాటు బంధువులు, స్నేహితులు సైతం మనోవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తితో తీవ్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది తెలుస్తోంది.

దీర్ఘకాలిక రోగుల్లో..
మధుమేహం, రక్తపోటు, కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా తదితర రోగాలున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేశ వీరికి వైరస్ సోకితే అంత తేలిగ్గా నయమయ్యే పరిస్థితులు లేవని చెబుతున్నారు. అందుకే కరోనా వైరస్ విపరీతంగా విజృంభిస్తున్న తరుణంలో అందరూ మెలకువలు పాటించి వైరస్ ను పారదోలాల్సిన అవసరం ఏర్పడింది. వైరస్ నిర్మూలనకు ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం. కరోనా వైరస్ ను ఎదుర్కొనే క్రమంలో ప్రజలు అప్రమత్తమవ్వాల్సిన అత్యవసరం ఎంతైనా ఉంది.

రకరకాల ఆలోచనలతో..
కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన సందర్భంగా పలువురు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. హైదరాబాద్ లో సైతం హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో వసతుల లేమితో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా రోగుల్లో మానసిక క్షోభ, డిప్రెషన్, ఆందోళన పెరుగుతున్నాయి. ఫలితంగా బాధితుల్లో మానసిక స్థితి విషమిస్తోంది. డిప్రెషన్ తో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతోందని వైద్యులు సూచిస్తున్నారు. నిరాశ, నిస్సత్తువతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

మారని పరిస్థితి
కరోనా వైరస్ విపరీతంగా పెరుగుతున్నా జనంలో అప్రమత్తత కనిపించడం లేదు. నిర్లక్షమే ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో కరోనా వైరస్ సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు వేలాది కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. దేశ జనాభా ఎక్కువగా ఉన్నందునే వైరస్ ఇంత వేగంగా వ్యాపిస్తోంది అనుకున్నా చైనా జనాబా మనకంటే ఎక్కువే కదా అని పలువురు చెబుతున్నారు. ప్రజల్లో అవగాహన పెరిగి ప్రతి ఒక్కరూ భౌతిక దరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఏర్పడింది.

అవగాహనతోనే నివారణ
కరోనా వైరస్ నిర్మూలనకు నడుం బిగించాలి. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఉద్యమించాలి. వైరస్ పై ముప్పేట దాడి చేయాలి. మనకున్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version