Mana Shankar Varaprasad Garu Updates: మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మన శంకర్ వరపరసాద్ గారు'(Mana Shankar Vara Prasad Garu) చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న కథలో చిరంజీవి నటిస్తుండడంతో అభిమానుల్లో,ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘మీసాల పిల్ల’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము. యూట్యూబ్ లో ఈ పాటకు 55 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి మార్కు స్టెప్పులు, ఆయన ట్రేడ్ మార్క్ ఎక్స్ ప్రెషన్స్ కారణంగా ఈ పాట యూట్యూబ్ లో అన్ స్టాపబుల్ గా ముందుకు దూసుకెళ్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
ఆయన రీసెంట్ గానే షూటింగ్ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టాడు. దానికి సంబంధించిన వీడియో ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాల ద్వారా విడుదల చేసాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ ఎలాంటి క్యారక్టర్ చేస్తున్నాడు?, ఆయన పాత్ర ఎంత నిడివి ఎంత వరకు ఉంటుంది?, చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో సన్నివేశాలు ఉంటాయా? వంటి సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, వెంకటేష్ ఎంట్రీ ఈ చిత్రం లో సెకండ్ హాఫ్ నుండి ఉంటుంది. ఆయన పాత్ర నిడివి 45 నిమిషాలు ఉంటుందట. ఆయనకు ప్రత్యేకంగా ఒక ఫైట్, అదే విధంగా చిరంజీవి కాంబినేషన్ లో ఒక పాట కూడా ఉంటుందట. ఇదంతా పక్కన పెడితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి CBI ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
ఇక విక్టరీ వెంకటేష్ చిరంజీవి కి బాడీ గార్డ్ గా కనిపించబోతున్నాడని లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. కర్ణాటక ప్రాంతం నుండి తెలుగు తెలియని బాడీ గార్డ్ పాత్రలో వెంకటేష్ కనిపిస్తాడని. చిరంజీవి మరియు వెంకీ మధ్య వచ్చే సంభాషణలు ఆడియన్స్ కి కడుపుబ్బా నవ్వించేలా చేస్తుందని, ఫ్యామిలీ ఆడియన్స్ కి వీళ్ళ కాంబినేషన్ లో ఉండే ప్రతీ షాట్ ఒక విజువల్ ఫీస్ట్ లాగానే అనిపిస్తుందని అంటున్నారు. నిన్నటి తరం లో సూపర్ స్టార్స్ గా ఒక వెలుగు వెలిగిన ఈ ఇద్దరికీ కామెడీ టైమింగ్ లో ఎలాంటి ప్రావీణ్యత ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో వీళ్లిద్దరికీ ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. కాబట్టి ఈ సంక్రాంతికి ఈ సినిమాకు టాక్ వస్తే మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.