Prabhas Latest News: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగాడు. ఆయన నటించిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో భారీ ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా గొప్ప ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం అందుకుంటున్న ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక వైవిధ్యాన్నైతే సంతరించుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఒకెత్తయితే ఆయన ఇతర సినిమాల కోసం టీజర్లను, ట్రైలర్లను రిలీజ్ చేస్తూ ఆ సినిమాల మీద హైప్ పెంచుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన తేజ సజ్జా హీరోగా చేసిన ‘మిరాయ్’ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఆ సినిమాకి వాయిస్ ని అందించాడు. దాంతో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక ‘కాంతారా చాప్టర్ 1’ సినిమా ట్రైలర్ ను సైతం రిలీజ్ చేశాడు. దాంతో ట్రైలర్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది… దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘కాంత’ సినిమా ట్రైలర్ ని కూడా తను రిలీజ్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా కూడా తప్పకుండా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందని సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు… ఇక సాయికుమార్ కొడుకు ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న శంభల సినిమా ట్రైలర్ ను కూడా ప్రభాస్ రిలీజ్ చేయడం విశేషం…ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయితే ప్రభాస్ లక్కి హ్యాండ్ అని మరోసారి ప్రూవ్ అవుతోంది.ఇక ఇప్పటికే ఆయన ట్రైలర్ రిలీజ్ చేసిన లేదంటే ఆ సినిమాలకు వాయిస్ అందించిన కూడా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి.
కాబట్టి ప్రభాస్ చెయ్యి వేస్తే అది పక్కా హిట్ అనే ఒక పేరునైతే సంపాదించుకున్నాడు… ఇక ఇది కూడా నిజమవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నారు…