Venkatesh and Balayya : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఏ ఇండస్ట్రీ నుంచి సినిమా వచ్చిన కూడా ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాని చూసి జడ్జిమెంట్ ని తెలియజేస్తున్నాడు. మరి ఇప్పుడు పాన్ ఇండియా హీరోలతో పాటు యంగ్ హీరోలకి కూడా భారీ ఆదరణ అయితే దక్కుతుంది. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరు ఎదురు చూస్తూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక పాన్ ఇండియాలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో సీనియర్ హీరోలు అయిన బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh) లాంటి నటులు సైతం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా వాళ్లు సైతం వాళ్ల సినిమాలతో వందల కోట్ల కలెక్షన్లు రాబడుతూ ఉండటం విశేషం… ఇక ఇంతకుముందు చాలా మంది బాలయ్య బాబు వెంకటేష్ సినిమాలకు 100 కోట్ల కలెక్షన్స్ రావడమే ఎక్కువ అని అనుకునేవారు.
కానీ ఇప్పుడు బాలయ్య బాబు హీరోగా ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన డాకు మహారాజ్ (Daaku Maharaj) సినిమా దాదాపు 150 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇంకా హౌస్ ఫుల్ అవుతూ ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vastunnam) సినిమా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించి భారీ కలెక్షన్స్ ను కోళ్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…
ఇక ఇప్పటివరకు వెంకటేష్ కెరియర్ లో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఏదీ లేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వంద కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా ఈ సంక్రాంతి విన్నర్ గా కూడా నిలిచాడు. ఇక అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం తన సత్తా చాటుకోవడమే కాకుండా ఆయన కెరియర్ లో బెస్ట్ సినిమాగా నిలిచిపోయే విధంగా ఈ సినిమాని రూపొందించాడు. ఇక ఇప్పటికే 200 కోట్లు మార్కును అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో 300 కోట్ల కలెక్షన్లకు పైన వసూళ్లను రాబడుతూ ఇండస్ట్రీలో కొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక సీనియర్ హీరోలందరిలో వెంకటేష్ చాలా వరకు వెనకబడిపోయాడు అంటూ ఇంతకుముందు చాలామంది చాలా రకాల కామెంట్స్ అయితే చేశారు. కానీ ఇప్పుడు కనక వెంకటేష్ సినిమా 300 కోట్ల మార్కును దాటితే మాత్రం సీనియర్ హీరోలందరిలో తను టాప్ పొజిషన్ లో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…